ETV Bharat / international

అధికార మార్పిడికి ట్రంప్‌ ససేమిరా - Joe Biden news updates

అమెరికా ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించారు జో బైడెన్.​ అయితే ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ససేమిరా అంటున్నారు. మరికొందరు రిపబ్లికన్​ నేతలు ట్రంప్​నకు మద్దతిస్తున్నారు. దీంతో అధికార మార్పిడిపై అనిశ్చితి కొనసాగుతోంది. అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Trump doesn't agree to transfer powers to newly elected president Joe Biden
అధికార మార్పిడికి ట్రంప్‌ ససేమిరా
author img

By

Published : Nov 10, 2020, 7:59 AM IST

అమెరికాలో అధికార మార్పిడిపై అనిశ్చితి కొనసాగుతోంది. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ససేమిరా అంటున్నారు. అధికారాలను బైడెన్‌కు బదలాయించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే- ఎన్నికల్లో అక్రమాలేం జరగలేదంటూ మాజీ అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ వంటి సొంత పార్టీ నేతలు ప్రకటించడం, పదవి నుంచి హుందాగా దిగిపోవడమే మేలంటూ కొందరు కుటుంబ సభ్యులూ సూచిస్తుండటం ట్రంప్‌పై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు- అధికారిక ప్రకటన వస్తేగానీ అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినట్లు తాము గుర్తించబోమని చైనా, రష్యా స్పష్టం చేశాయి.

సంక్లిష్టంగా అధికార మార్పిడి!

సాధారణంగా అమెరికాలో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థిని కాబోయే అధ్యక్షుడిగా 'జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (జీఎస్‌ఏ)' విభాగం గుర్తిస్తుంది. అనంతరం అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే- ట్రంప్‌ తన ఓటమిని ఇప్పటివరకూ అంగీకరించలేదు. దీంతో బైడెన్‌ను విజేతగా జీఎస్‌ఏ ఇంకా గుర్తించలేదు. ప్రస్తుతం ఆ విభాగం చీఫ్‌గా ఎమిలీ ముర్ఫీ ఉన్నారు. ఆమెను ట్రంపే నియమించారు. కాబట్టి జీఎస్‌ఏ ప్రస్తుత అధ్యక్షుడికి అనుకూలంగా వ్యవహరిస్తుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ.. అధికార మార్పిడికి సంబంధించిన ఓ లేఖపై సంతకం చేసేందుకు ఎమిలీ సోమవారం నిరాకరించారు. వాస్తవానికి అధికారాల బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేందుకుగాను ప్రతి ఫెడరల్‌ భవనంలో కాబోయే అధ్యక్షుడి బృందానికి కార్యాలయ స్థలం కేటాయించాలి. కోటి డాలర్ల నిధులు కూడా మంజూరు చేయాలి. లేఖపై సంతకానికి ఎమిలీ నిరాకరించడం వల్ల ప్రస్తుతం బైడెన్‌ బృందానికి అవేవీ అందవు. ట్రంప్‌ నుంచి అనుమతి వస్తేగానీ జీఎస్‌ఏ బైడెన్‌ విజయాన్ని అధికారికంగా గుర్తించే అవకాశాల్లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో అధికార మార్పిడి వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

పెరుగుతున్న ఒత్తిడి

అధికార మార్పిడి సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. బైడెన్‌ బృందంతో కలిసి ముందుకు సాగే ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని 'నాన్‌ పార్టిసన్‌ సెంటర్‌ ఫర్‌ ప్రెసిడెన్షియల్‌ ట్రాన్సిషన్‌' సలహా బోర్డు ఆయన్ను కోరింది. అమెరికా ప్రజల తీర్పును గౌరవించాలంటూ ట్రంప్‌ను బైడెన్‌ బృందంలోని కీలక నేత జెన్‌ సాకి డిమాండ్‌ చేశారు. మరోవైపు ట్రంప్‌ కుటుంబంలోనూ అధికార బదలాయింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమిని అంగీకరించడం మేలని అల్లుడు కుష్నర్‌, పోరాటం కొనసాగించాలని కుమారులు డొనాల్డ్‌ జూనియర్‌, ఎరిక్‌ అభిప్రాయపడుతున్నారు. భార్య మెలానియా తొలుత అధికార మార్పిడికి అనుకూలంగా మాట్లాడినా, ప్రస్తుతం ఆ వాదనను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

రిపబ్లికన్‌ నేతల్లో భిన్నాభిప్రాయాలు

బైడెన్‌ను విజేతగా అంగీకరించే విషయంపై రిపబ్లికన్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెనేటర్లు మిట్‌ రోమ్నీ, లిసా ముర్కోవ్‌స్కి అధికార మార్పిడికి సహకరించాలంటూ ట్రంప్‌నకు సూచించారు. లిండ్సే గ్రాహమ్‌, టెడ్‌ క్రూజ్‌, ఆండీ బిగ్స్‌ తదితర నేతలు మాత్రం న్యాయ పోరాటం కొనసాగించాలని చెబుతున్నారు. ట్రంప్‌ పోరాడే ఉద్దేశంతోనే ఉన్నారని ఆయన ఆర్థిక సలహాదారు ల్యారీ కుడ్లో తెలిపారు. ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది రూడీ గివ్‌లియాని కూడా న్యాయ పోరాటానికి అండగా నిలుస్తానని మాటిచ్చారు. మరికొందరు మద్దతుదారులూ కోర్టులోనే తేల్చుకోవాలని ట్రంప్‌ను కోరుతున్నారు. మరోవైపు- ప్రస్తుతం జీవించి ఉన్న మాజీ అధ్యక్షులు జిమ్మీ కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామా మాత్రం బైడెన్‌ను విజేతగా గుర్తించారు. ట్రంప్‌ హుందాగా పదవి నుంచి తప్పుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. వీరిలో బుష్‌ రిపబ్లికన్‌ నేత కాగా, మిగిలిన ముగ్గురూ డెమొక్రాట్లు.

ఇదీ చూడండి: విడాకులు తీసుకోనున్న ట్రంప్ దంపతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.