అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై సెనేట్ విచారణలో భాగంగా.. తమ వాదనను 3గంటల్లోనే ముగించేశారు ట్రంప్ తరఫు న్యాయవాదులు. జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్ ఘటనకు సంబంధించి ట్రంప్ తన మద్దతుదారులను ప్రేరేపించలేదని విచారణలో భాగంగా వాదించారు. రెండో అభిశంసనను డెమొక్రాట్ల రాజకీయ కుట్రగా అభివర్ణించిన ట్రంప్ తరఫు లాయర్లు... పదవీకాలం ముగిశాక అభిశంసన వేటు చెల్లదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్‌కు సొంత లాయర్ షాక్!
క్యాపిటల్ హింసకాండకు ట్రంప్ కారకుడని రుజువు చేసేందుకు డెమొక్రాట్ల వద్ద సరైన ఆధారాలు లేవని ట్రంప్ న్యాయవాది బ్రూస్ కాస్టర్ తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ శాంతి భద్రతలకు ప్రాధాన్యమిచ్చేవారు అని పేర్కొన్నారు.
మొత్తంగా రెండు రోజుల్లో 16 గంటల పాటు వాదించేందుకు ట్రంప్ తరఫు న్యాయవాదులకు అవకాశమున్నా.. వారు దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు.
ఇదీ చదవండి:కొత్త వీడియోలతో ట్రంప్‌కు మరిన్ని చిక్కులు!