ETV Bharat / international

'చైనాతో తెగతెంపులు కూడా ఓ ప్రత్యామ్నాయమే!' - trump said on issues related to china

కరోనా వైరస్​కు కేంద్రస్థానంగా ఉండటం, సరిహద్దుల్లో దూకుడుగా ఉండటంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం కూడా ప్రత్యామ్నాయమేనని చెప్పుకొచ్చారు.

trump on china
చైనాలో ఆర్థిక ఉపసంహరణ​ కూడా ఓ ప్రత్యామ్నాయమే: ట్రంప్
author img

By

Published : Jun 19, 2020, 11:04 AM IST

చైనా తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనాతో ఆర్థిక సంబంధాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం కూడా తమకు ఓ ప్రత్యామ్నాయమేనని చెప్పారు.

అయితే ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు పరస్పరం ఆధారితాలని.. పూర్తిస్థాయి ఉపసంహరణ అసాధ్యమని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటిజర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ఉపసంహరణ కూడా ఒక ప్రత్యామ్నాయమేనని ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

"వాణిజ్య కమిటీలో లైటిజర్ వ్యాఖ్యలు తప్పేమీ కాదు. ఈ అంశమై నేనే స్పష్టత ఇవ్వలేదు. అయితే విధాన నిర్ణయాల్లో భాగంగా చైనా నుంంచి పూర్తిగా ఉపసంహరించుకోవడాన్ని కూడా అమెరికా ఓ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది."

- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అమెరికా వాణిజ్య విధానాలపై బుధవారం... కాంగ్రెస్​లో ప్రసంగించారు లైటిజర్. చైనా నుంచి పూర్తిస్థాయి ఉపసంహరణ కుదరదని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: ఆ దేశాల్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.