ETV Bharat / international

ట్రంప్ X బైడెన్: 'సోషల్​ వార్​'లో ఎవరిది పైచేయి?

author img

By

Published : Jul 7, 2020, 3:08 PM IST

Updated : Jul 7, 2020, 3:32 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత జో బైడెన్​ల మధ్య సామాజిక మాధ్యమాల్లో 'లైవ్' యుద్ధం జరుగుతోంది. ప్రతికూల 'కామెంట్ల'తో డెమోక్రాట్ల ప్రచారం జరుగుతుంటే... వాటిని దీటుగా తిప్పికొట్టి ట్రంప్ తన విజయాలను 'షేర్' చేసుకుంటున్నారు. అనుచరులు మాత్రం తమ అభిమాన నేతలకు 'లైకులు' వేసుకుంటున్నారు. అయితే ఇద్దరు అభ్యర్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియా ప్రచారంలో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అవేంటో తెలుసుకోండి.

Trump, Biden fight for primacy on social media platforms
ట్రంప్, బైడెన్​ల సామాజిక మాధ్యమ పోరు!

సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ల మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతోంది. 8 కోట్ల మంది డిజిటల్ 'సైనికులు' ఉన్న ట్రంప్​తో కేవలం 64 లక్షల సైన్యంతో 'ట్విట్టర్' రణక్షేత్రంలో తలపడుతున్నారు బైడెన్. ఇదేకాక ఇతర సామాజిక మాధ్యమాల్లోనూ వీరిద్దరి ఫాలోవర్ల మధ్య అంతరం భారీగా ఉంది.

దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్​బుక్​లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు సగటున 14 పోస్టులు పెడుతున్నారు. ఆయనకు ఫేస్​బుక్​లో 28 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్​కు ఫేస్​బుక్​లో 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. సగటున ఏడు పోస్టులు చేస్తున్నారు. ట్విట్టర్​లో ట్రంప్​ 82.4 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉండగా.. బైడెన్ కేవలం 6.4 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

అంతేగాక గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ సైన్యాన్ని భారీగా పెంచుకున్నారు ట్రంప్. వీరంతా తమ క్యాంపెయిన్ మెసేజ్​లను వందలసార్లు రీట్వీట్ చేస్తున్నారు. గూగుల్, యూట్యూబ్ ప్రకటనల్లోనూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యేందుకు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో డిజిటల్ ప్రపంచంలో ఇలాంటి మద్దతు ఉండటం ట్రంప్​నకు కాస్త ఉరటనిచ్చే అంశం. తన మద్దతుదారులతో నిరంతరం సంభాషించడం, నిరుద్యోగం, జాతి వివక్ష, కరోనా విషయంలో తన దుర్బలత్వాన్ని విస్మరించే సందేశమివ్వడానికి ఇది భారీ వేదికలా అధ్యక్షుడికి ఉపయోగపడుతోంది.

ప్రస్తుతం బైడెన్ సైతం తన 'సామాజిక' శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఫేస్​బుక్ ప్రకటనలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. జూన్​ నెలలో తొలిసారి ట్రంప్​తో పోలిస్తే రెట్టింపు డబ్బును ఖర్చుచేశారు. ఇన్​స్టాగ్రామ్​ మద్దతుదారులను నియమించుకొని ఆన్​లైన్ ఫండ్​రైజింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

నూతన సవాళ్లు!

అయితే అధ్యక్షుడికి ప్రస్తుతం కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. సామాజిక సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోషల్​ మీడియాలో అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ ట్విట్టర్​ వంటి సంస్థల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

"అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ నేత బైడెన్​లకు ఇప్పుడు చాలా భిన్నమైన సవాళ్లు ఉన్నాయి. తన అనుచరులను ట్రంప్ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బైడెన్ ఇప్పుడు కొత్త ఓటర్లు, మద్దతుదార్లకు తన గురించి తాను పరిచయం చేసుకోవాలి."

-తారా మెక్​గోవన్, అక్రోనిమ్ ఫౌండర్

సామాజిక మాధ్యమాలన్నీ వ్యతిరేకమే!

ట్రంప్​కు ట్విట్టర్ వరుస షాకులిస్తోంది. మెయిల్-ఇన్ ఓటింగ్​ వల్ల మోసాలు పెరుగుతాయన్న ట్వీట్​కు ఫ్యాక్ట్​చెక్ జత చేసింది. ఓ మానిప్యులేటెడ్ వీడియోను పోస్ట్ చేసినందుకు వినియోగదారులను అప్రమత్తం చేసింది. మినియాపొలిస్​లో లూఠీలు చేసేవారిని కాల్చేస్తామని హెచ్చరించిన ట్వీట్​ను హైడ్ చేసింది.

ట్రంప్​కు వ్యతిరేకంగా ట్విట్టర్ కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫేస్​బుక్​పై ప్రభావం పడింది. సంస్థలో నుంచి చాలా కంపెనీలు పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల ఫేస్​బుక్​పై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో నియమాలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని ఫేస్​బుక్ ప్రకటించింది.

స్నాప్​చాట్ సైతం ట్రంప్​ ప్రొఫైల్​పై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడి ఖాతాను యాక్టివ్​గా ఉంచుతూనే ఎక్కువ ప్రదర్శించకుండా ఉంచనున్నట్లు గతనెలలో ప్రకటించింది. విద్వేష ప్రసంగాలు, హింసాత్మక కామెంట్లకు చెక్​పెడుతూ రెడిట్ సంస్థ ట్రంప్ అనుచరుల ఖాతా 'ది_డొనాల్డ్'​ను నిషేధించింది.

వ్యూహాలకు పదును

ట్రంప్, బైడెన్​లు సామాజిక మాధ్యమాల విషయంలో భిన్నమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. ట్రంప్​ డిజిటల్ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్న 'టీం ట్రంప్ ఆన్​లైన్' రాత్రిపూట లైవ్ టెలికాస్ట్​లు నిర్వహిస్తోంది. ఫేస్​బుక్​, ట్విట్టర్​, ఇన్​స్టాగ్రామ్​ మాధ్యమాల్లో వీడియోలు ప్రసారం చేస్తోంది. ఈ ప్రచారంలో ట్రంప్ కోడలు లారా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ట్విట్టర్​లో ట్రంప్ అత్యంత చురుకుగా ఉంటున్నారు. జూన్ 14 నుంచి వారం రోజుల వ్యవధిలో 160 ట్వీట్​లు చేశారు. ఇందులో 50 వరకు అమెరికా సైన్యం, రైట్​ వింగ్ మీమ్స్​ తయారీదారులు, సాంప్రదాయక వార్తా సంస్థలు, కాంగ్రెస్ అభ్యర్థుల ట్వీట్​లను రీట్వీట్ చేశారు.

"రోజూవారీ వినియోగదారుల ట్వీట్లను రీట్వీట్​ చేయడం ద్వారా అధ్యక్షుడు నిరంతరం తమతో కలిసి ఉన్నట్లు అనుచరులు భావిస్తారు. ట్రంప్ ప్రచార బృందం.. సామాజిక మాధ్యమాల సంస్కృతితో కలిసిపోతోంది. అందుకే వారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు."

-లోగన్ కుక్​, మీమ్​ మేకర్

లోగన్ మీమ్స్​ను ట్రంప్ పలుమార్లు ట్విట్టర్​లో షేర్ చేశారు. వీడియోలను మార్ఫింగ్ చేసి ట్రంప్ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పోస్టులు వివాదాస్పదంగా ఉన్న కారణంగా లోగన్ ఖాతాను ట్విట్టర్ గతవారం శాశ్వతంగా నిలిపివేసింది.

"ట్రంప్ కానీ, అతని కుటుంబసభ్యులు.. తమ ట్వీట్లను రీట్వీట్ చేస్తే అనుచరులు దాన్ని ఓ పండగలా నిర్వహించుకుంటారు. అపహాస్యమైన మీమ్స్​, వీడియోలను సృష్టించేందుకే ట్రంప్ అనుచరులు ప్రయత్నిస్తారు. దీన్నో ఆటగా భావిస్తారు. అధ్యక్షుడి​ నుంచి రీట్వీట్ పొందడమే ఇందులో దక్కే అత్యుత్తమ బహుమతి."

-మిషా లేబోవిచ్, టెక్ వ్యవస్థాపకుడు, డెమోక్రటిక్ మద్దతుదారుడు

సాంప్రదాయ మార్గమే..

మరోవైపు బైడెన్ మాత్రం సాంప్రదాయ పోకడలకే పరిమితమయ్యారు. ట్రంప్ 160 ట్వీట్లు చేసిన వారం వ్యవధిలో బైడెన్ 60 ట్వీట్లను మాత్రమే చేశారు. ఇందులో కొన్ని బరాక్ ఒబామా వంటి వెరిఫైడ్ ఖాతాలు, వార్తా సంస్థల నుంచి రీట్వీట్ చేశారు. తన ప్రచార సంస్థలు రూపొందించిన వీడియోలనే బైడెన్ ట్వీట్ చేశారు.

అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అనేది కేవలం నెంబర్లకే పరిమితం కాదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ డిజిటల్ ఎలక్షన్​ వార్​లో రానున్న రోజుల్లో ఎవరు పైచేయి సాధిస్తారు? అభిమానుల మద్దతు సాధించి ఎవరు గెలుపొందుతారో అనేది ఎన్నికల ఫలితాల్లోనే తేలేది!

ఇదీ చదవండి- ఈ విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్​ది ఒకే మాట

Last Updated : Jul 7, 2020, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.