ETV Bharat / international

ట్రంప్​-కిమ్​ ముచ్చటగా మూడోసారి భేటీ - south korea

ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు డొనాల్డ్​ ట్రంప్​. కిమ్​ జోంగ్ ఉన్​తో అనూహ్యంగా మూడోసారి భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంట పాటు చర్చ జరిగింది.

ట్రంప్​-కిమ్​ ముచ్చటగా మూడోసారి భేటీ
author img

By

Published : Jun 30, 2019, 5:58 PM IST

Updated : Jun 30, 2019, 11:18 PM IST

ట్రంప్​-కిమ్​ ముచ్చటగా మూడోసారి భేటీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​... ఉత్తరకొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​తో మూడోసారి భేటీ అయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల్లోని డీఎంజీ(సైనికరహిత) ప్రాంతానికి వచ్చిన ట్రంప్​ను కిమ్​ జోంగ్​ ఉన్ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు.

ఉత్తరకొరియాలో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా అరుదైన ఘనత సాధించారు ట్రంప్​. ఈ దేశంలో అడుగుపెట్టినందుకు గర్వంగా ఉందని కిమ్​కు ట్రంప్​ చెప్పారు.

గతంలో ఇరుదేశాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకుని, భవిష్యత్తులో కలిసి ముందుకు సాగాలని ట్రంప్ ఆకాంక్షించటం ఆనందంగా ఉందన్నారు కిమ్​. ట్వీట్ ద్వారా ట్రంప్ ఆహ్వానం పంపడం ఆశ్చర్యాన్ని కలగజేసిందని తెలిపారు.

సరిహద్దులో కిమ్​తో రెండు నిమిషాలు మాట్లాడతానన్న ట్రంప్​... 50 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

ఉభయకొరియా సరిహద్దు ప్రాంత గ్రామం పన్మున్జోమ్​లోని 'ఫ్రీడమ్​ హౌస్​' భవనంలో కిమ్​తో జరిగిన భేటీలో ట్రంప్​తో పాటు ఆయన కూతరు ఇవాంకా ట్రంప్, అల్లుడు జేర్డ్​ కుశ్నర్​ పాల్గొన్నారు.

ఉత్తరకొరియాలో పరిస్థితులు మారాయి

కిమ్​తో తొలిసారి భేటీ అయినప్పుడు ఉత్తరకొరియాలో ప్రమాదకర పరిస్థితులున్నాయని, ప్రస్తుతం అలా లేదని చెప్పారు ట్రంప్​. పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. అణ్వాయుధ కార్యకలపాల కేంద్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉత్తర కొరియాపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలంటే ఇది జరిగితీరాలని స్పష్టం చేశారు. అణు కార్యక్రమాలపై కిమ్​తో మరోసారి చర్చలు జరుపుతామని చెప్పారు ట్రంప్​. కిమ్​ను అమెరికా రావాలని ఆహ్వానించినట్లు వెల్లడించారు.

అణు కార్యకలపాలపై చర్చించేందుకు చివరిసారి ఫిబ్రవరిలో వియత్నాంలో ట్రంప్​-కిమ్​ రెండోసారి భేటీ అయ్యారు. ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి.

ఇదీ చూడండి: ట్రంప్​-కిమ్​ సాక్షిగా జవాన్లు, పాత్రికేయుల ఫైట్

Intro:Body:

rr

Conclusion:
Last Updated : Jun 30, 2019, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.