ETV Bharat / international

ఆ వీసాలపై ట్రంప్​ యూటర్న్- భారతీయులకు మేలు!

హెచ్​-1బీ విసాదారుల జీవిత భాగస్వాముల ఉద్యోగాల అవకాశాలను అడ్డుకోవద్దని హోంల్యాండ్​ భద్రతా విభాగం.. వాషింగ్టన్​ జిల్లా కోర్టును అభ్యర్థించింది. 2015 నాటి తీర్పును కొనసాగించాలని కోరింది. తీర్పుతో అమెరికా సాంకేతిక రంగ ఉద్యోగులకు నష్టం కలుగుతుందన్న వాదనలను తోసిపుచ్చింది.

Trump admin urges US court not to block work permits to spouses of H1B visa-holders
'హెచ్​-4 వీసాదారుల ఉపాధి అధికారాన్ని అడ్డుకోవద్దు'
author img

By

Published : May 7, 2020, 10:31 AM IST

హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల ఉపాధి విషయంలో అనూహ్యంగా వైఖరి మార్చుకుంది డొనాల్డ్ ట్రంప్ సర్కారు. హెచ్​-4 వీసాదారులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవద్దని.. ఓ జిల్లా కోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు వాషింగ్టన్​ జిల్లా కోర్టుకు 11పేజీల పత్రాలను సమర్పించింది.

హెచ్​-4 వీసాదారులు ఉపాధి పొందేలా ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని రద్దు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం... ఇలా యూటర్న్ తీసుకోవడం గమనార్హం.

2015తీర్పుతో...

ఉద్యోగం ఆధారంగా శాశ్వత నివాసం కోరుకునే వారి కుటుంబ సభ్యుల(జీవిత భాగస్వామి, 21ఏళ్లలోపు పిల్లలు)కు హెచ్​-4 వీసాలు అందిస్తారు. వీరిలో అనేక మంది భారతీయ ఐటీ నిపుణులే ఉన్నారు.

అయితే వీరిలోని కొన్ని వర్గాలు ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ 2015లో అగ్రరాజ్యం కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా సంకేతికరంగ ఉద్యోగుల తరఫున "సేవ్​ జాబ్స్​ యూఎస్​ఏ" అనే సంస్థ సవాలు చేసింది. హెచ్​-4లోని కొన్ని వర్గాల వారికి ఉద్యోగాలు ఇస్తే.. తమ దేశస్థులకు ప్రమాదం ఉందని ఆరోపించింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ కేసు ఎన్ని రోజులపాటు నడిస్తే.. అమెరికన్లకు అంతగా కోలుకోలేని నష్టం జరుగుతుందని పేర్కొంది.

ఈ విషయంపై ఈ నెల 5న వాషింగ్టన్​ జిల్లా కోర్టు ముందు హోంల్యాండ్​ భద్రతా విభాగం(డీహెచ్​ఎస్​) వాదనలు వినిపించింది. హెచ్​-4 వీసాదారులు ఉద్యోగం చేయడం వల్ల అమెరికా సంస్థలకు ఎలాంటి నష్టం జరగదని పేర్కొంది. సేవ్​ జాబ్స్​ యూఎస్​ఏ ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. అందువల్ల స్టే విధంచాలన్న పిటిషనర్​ అభ్యర్థనను కొట్టివేయాలని అభ్యర్థించింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా హయాంలో.. హెచ్​-4వీసాదారుల్లోని కొన్ని వర్గాల వారికి ఉద్యోగం చేసుకోవడానికి అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే 2017లో అధికారంలోకి వచ్చిన ట్రంప్​ ప్రభుత్వం.. ఈ నిబంధనను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు కోర్టుకు తెలిపింది. ఎన్​రీఆర్​ఎమ్​(నోటీస్​ ఆఫ్​ ప్రొపోజ్డ్​ రూల్​మేకింగ్​) జారీ చేయాలనుకుంటున్నట్టు అనేక మార్లు కోర్టుకు తెలిపింది. కానీ డీహెచ్​ఎస్​ మాత్రం 2015 నాటి హెచ్​-4 వీసాదారుల ఉపాధి అధికారాన్ని రద్దు చేయలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.