ETV Bharat / international

హెచ్​-1బీపై ట్రంప్​ లాస్ట్​ పంచ్​- వారికే లాభం!

author img

By

Published : Jan 14, 2021, 4:57 PM IST

అమెరికన్ల ఉగ్యోగాలు, వేతనాలను రక్షించే విధంగా.. ఓ నిబంధనను ప్రవేశపెట్టింది ట్రంప్​ ప్రభుత్వం. హెచ్​-1బీతో పాటు ఇతర వీసాలపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న విదేశీయుల కనీస వేతనాలను పెంచింది. అమెరికా సంస్థలు.. తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్​ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Trump admin announces final rule that will raise prevailing wage rates for H-1B workers
హెచ్​-1బీపై ట్రంప్​ తుది నిబంధన.. వారికే లాభం!

హెచ్​-1బీతో పాటు ఇతర వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల కనీస వేతనాలను పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం తన చివరి రోజుల్లో నిర్ణయం తీసుకుంది. అమెరికా సంస్థలు.. అగ్రరాజ్య ప్రజలను పక్కనపెట్టి తక్కువ జీతాలతో విదేశీయులను నియమించుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.

ఈ నిబంధన.. అమెరికన్ల ఉద్యోగాలు, జీతాలను రక్షిస్తాయని అగ్రరాజ్య కార్మికశాఖ పేర్కొంది. ఇప్పుడున్న వేతనాల పద్ధతిలో సంస్కరణలు చేపట్టి.. హెచ్​-1బీ, హెచ్​-1బీ1, ఈ-3తో పాటు శాశ్వత ఉపాధి ధ్రువీకరణ కార్యక్రమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయొచ్చని స్పష్టం చేసింది. తోటి అమెరికా ఉద్యోగికి సమానంగా విదేశీయులకు వేతనాలు అందించే విషయంలో మరింత ఖచ్చితత్వాన్ని ఈ తుది నిబంధన తీసుకొస్తుందని కార్మికశాఖ అభిప్రాయపడింది.

భారత్​, చైనా తదితర దేశాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మందిని నియమించుకుంటాయి అగ్రరాజ్యంలోని టెక్​ సంస్థలు.

ఇదీ చూడండి:- 'హెచ్​1బీ' ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.