ETV Bharat / international

అభిశంసన తీర్మానం ఓ తెలివితక్కువ పని: ట్రంప్ - అభిశంసన

ఉక్రెయిన్​ నాయకుడితో ఫోన్​ సంభాషణలపై దర్యాప్తు తనపై తిరుగుబాటు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ చేసిన వ్యాఖ్యలు అభిశంసన యుద్ధాన్ని తారస్థాయికి చేర్చింది. ట్రంప్​నకు, డెమొక్రాట్లకు మధ్య మాటల యుద్ధం పెరిగింది. అభిశంసన అనే తెలివితక్కువ పనితో డెమొక్రాట్లు సమయం వృథా చేస్తున్నారని ఆరోపించారు ట్రంప్​.

అభిశంసన తీర్మానం ఓ తెలివితక్కువ పని: ట్రంప్
author img

By

Published : Oct 3, 2019, 5:01 AM IST

అభిశంసన ఓ తిరుగుబాటు అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఈ క్రమంలో ట్రంప్​, కాంగ్రెస్​ మధ్య అభిశంసన వివాదం తారస్థాయికి చేరింది. మాటల యుద్ధం మొదలైంది.

2020 ఎన్నికల్లో ట్రంప్​ ప్రధాన ప్రత్యర్థి, డెమొక్రాట్​ అభ్యర్థి జో బైడెన్​కు నష్టం కలింగించేందుకు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లోదిమిర్​ జెలెంస్కీపై ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ ట్రంప్​పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు డెమొక్రాట్లు.

అభిశంసనపై ముందుకు సాగేందుకు నిజమైన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్​ దిగువ సభలో దర్యాప్తునకు నాయకత్వం వహించిన డెమొక్రాట్​ ఆడమ్​ షిఫ్​ పేర్కొన్నారు. ఆయనపై ఎదురుదాడికి దిగారు ట్రంప్​. ఇది అభిశంసన కాదు తిరిగుబాటు అంటూ మంగళవారం ట్విట్టర్​లో పేర్కొన్నారు. షిఫ్​ అనారోగ్యానికి గురయ్యారు.. రాజీనామా చేయాలంటూ బుధవారం ట్వీట్​ చేశారు ట్రంప్​. అంతకుముందు షిఫ్​ అరెస్ట్​కు పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్​ నాయకుడుతో ఫోన్ మాట్లాడిన విషయం వాస్తవమే కాని తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు ట్రంప్​. దానికి బుధవారం మద్దతు పలికారు రష్యా అధ్యక్షుడు వ్లొదిమర్​ పుతిన్​.

సమయం వృథా..

అభిశంసన అనే అస్త్రంతో డెమొక్రాట్లు సమయాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు ట్రంప్​. ఉక్రెయిన్​ నాయకుడితో ఫోన్​ కాల్​పై దర్యాప్తు అనేది తెలివితక్కువ పనిగా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి డెమొక్రాట్లు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరి సమయాన్ని, శక్తిని తెలివితక్కువ పనితో వృథా చేయకూడదన్నారు. 2016 ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలుపొందినప్పటి నుంచి వారు చేస్తున్నది ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: గాంధీ 150: ఈటీవీ భారత్​ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 2 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2147: Peru Political Turmoil AP Clients Only 4232917
Political imbroglio brings Peru to a standstill
AP-APTN-2145: US TX Guyger Sentencing 2 20191002I AP Clients Only 4232916
Dad weeps over slain son at Dallas cop trial
AP-APTN-2144: US Trump Schiff Treason AP Clients Only 4232915
Trump: Some people say 'Shifty Schiff' treasonous
AP-APTN-2120: Haiti Crisis AP Clients Only 4232914
Haitians push for normalcy despite deep crisis
AP-APTN-2111: Hong Kong Lau No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4232913
Former HK lawmaker: we don't want rivers of blood
AP-APTN-2100: UK Brexit Gove AP Clients Only 4232912
Gove: UK plan is chance for 'serious talks' with EU
AP-APTN-2047: US KS Attorney General Barr Must Credit KSNT, No Access Topeka, Kansas City, Wichita, Joplin, No use US broadcast networks, no re-sale, re-use or archive 4232910
Barr at law enforcement roundtable in Kansas
AP-APTN-2046: US Trump Finland WTO AP Clients Only 4232909
Angry Trump rails against Biden, media, WTO
AP-APTN-2032: Tunisia Election AP Clients Only 4232908
Tunisia presidential runoff set for 13 October
AP-APTN-2015: Colombia Venezuela Opposition AP Clients Only 4232906
Colombian Congress hosts Venezuelan lawmakers
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.