ETV Bharat / international

'ట్రంప్​ హయాంలో భారత్​తో వాణిజ్య విభేదాలు'

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ పరిపాలనలో భారత్​తో వాణిజ్య విభేదాలు ఎక్కువగా వెలుగు చూశాయని ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు దిగుమతులపై ఎక్కువ మొత్తంలో పన్ను విధిస్తుండడమే కారణం అని పేర్కొంది.

Trade disputes with India during the Trump administration survey says
'ట్రంప్​ హయంలో భారత్​తో వాణిజ్య విభేదాలు'
author img

By

Published : Jan 5, 2021, 8:05 AM IST

Updated : Jan 5, 2021, 9:09 AM IST

ట్రంప్​ హయంలో అమెరికా-భారత్​ల మధ్య వాణిజ్య వ్యవహారాలు సవ్యంగా సాగలేదు. పన్నులపై విభేదాలు ఉండడంమే ఇందుకు కారణం. కాంగ్రెసినల్​ రీసెర్చి సర్వీస్​ వెలువరించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. సెల్​ఫోన్​, ఇతర టెలికాం పరికరాలపై గతంలో భారత్ ఎలాంటి పన్నులు విధించకపోగా, ఇప్పుడు 15-20శాతం పన్నులు వేస్తోందని ఉదాహరణగా చూపింది. వ్యవసాయ ఉత్పత్తులపై అత్యధికంగా పన్ను వేస్తోందని, వీటిని తరుచూ పెంచుతుండడంతో ఎగుమతిదార్లకు ఇబ్బందికరంగా మారిందని తెలిపింది. దాంతో పలు సందర్భాల్లో ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేసింది.

ట్రంప్​ ప్రభుత్వం ఉక్కుపై 25శాతం, అల్యూమినియంపై 10శాతం, పన్ను విధించడాన్ని భారత్​ కూడా వ్యతిరేకించిందని తెలిపింది. వాణిజ్య ప్రాధాన్య కార్యక్రమం నుంచి భారత్​ను తప్పించడంతో దానికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులను 10శాతం నుంచి 25శాతానికి పెంచిందని పేర్కొంది. ఈ విభేదాల కారణంగానే ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కుదరలేదని అభిప్రాయపడింది. రక్షణ ఉత్పత్తుల కొనుగోలుపై భారత్​ ఆసక్తి చూపుతుండడాన్ని ప్రస్తావించింది. భారత్​ వాయుసేన కోసం రష్యా నుంచి ఎస్​-400 ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ను కొనుగోలు చేస్తే అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చూడండి: గెలుపైనా.. ఓటమైనా.. నిను వీడని నీడ మేమే!

Last Updated : Jan 5, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.