ETV Bharat / international

ట్రంప్‌కు 'యాపిల్'​ సీఈఓ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా? - తాజా వార్తలు ట్రంప్

డొనాల్డ్​ ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన​ విధానాలను వ్యతిరేకించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా వీసా విధానంపై ఆయన తీసుకున్న నిర్ణయాలను గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్‌ దిగ్గజ సంస్థలు వ్యతిరేకించి కోర్టు మెట్లెక్కాయి. అయితే అంతలా వ్యతిరేకించిన వాళ్లు ట్రంప్‌కు బహుమతులు ఇచ్చారంటే నమ్ముతారా? కానీ నిజం.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ట్రంప్‌కు యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ఒక గిఫ్ట్‌ ఇచ్చారంట. ఏంటో తెలుసా?

Trump
ట్రంప్‌కు 'యాపిల్'​ సీఈఓ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?
author img

By

Published : Jan 22, 2021, 5:15 AM IST

యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణం కార్యక్రమం పూర్తయింది. తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వైట్ హౌస్‌ నుంచి ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టు వెళ్లారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ తీసుకున్న పలు నిర్ణయాలు ఆయన స్థాయిని పెంచితే.. మరికొన్ని అధ్యక్ష పదవికి ఆయన అనర్హుడనే పేరును తెచ్చాయి. ఏదేమైనప్పటికీ పదవీ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను సమర్థించిన వారికంటే వ్యతిరేకించిన వారే ఎక్కువ. ముఖ్యంగా వీసా విధానంపై ఆయన తీసుకున్న నిర్ణయాలను గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్‌ దిగ్గజ సంస్థలు వ్యతిరేకించి కోర్టు మెట్లెక్కాయి. మరి అంతలా వ్యతిరేకించిన వాళ్లు ట్రంప్‌కు బహుమతులు ఇచ్చారంటే నమ్ముతారా? అయినా నిజం.. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నకాలంలో ట్రంప్‌కు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్ ఒక గిఫ్ట్‌ ఇచ్చారంట. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ నుంచి 5,999 డాలర్లు విలువ చేసే మాక్‌ ప్రో కంప్యూటర్‌ను బహుమతిగా అందుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీన్ని టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఉన్న యాపిల్‌ ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్లు అందులో పేర్కొన్నారు. అయితే దీన్ని ట్రంప్‌కు టిమ్‌ ఎప్పుడు బహూకరించారనేది మాత్రం ప్రస్తావించలేదు. యాపిల్‌ కంపెనీతో పాటు బోయింగ్, ఫోర్డ్ కంపెనీలు కూడా ట్రంప్‌కు బహుమతులు ఇచ్చాయి. ఫోర్డ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ బిల్ ఫోర్డ్ ఒక లెదర్‌ జాకెట్, బోయింగ్ ప్రెసిడెంట్ డెన్నిస్‌ ములెన్‌బర్గ్‌ కస్టమైజ్డ్‌ గోల్ఫ్ క్లబ్‌ను బహుమతిగా ఇచ్చారట. అయితే ట్రంప్‌కు వచ్చిన బహుమతుల్లో అత్యంత ఖరీదైనది మాత్రం కాంస్యంతో తయారు చేసిన యుఎస్‌ మెరైన్స్‌ విగ్రహం. దీన్ని గ్రేటెస్ట్ జనరేషన్స్‌ ఫౌండేషన్‌ సీఈవో తిమోతి డేవిస్‌ బహూకరించారట. దీని విలువ 25,970 డాలర్లు. ఇవే కాకుండా ఛాంపియన్‌షిప్‌ బెల్ట్‌, నేషనల్‌ మెమోరియల్‌ కాంస్య విగ్రహం, గోల్ఫ్‌ క్లబ్ కవర్‌, చేతి గ్లోజ్‌, గోల్ఫ్ బ్యాగ్, గొడుగు అధ్యక్షుడిగా ట్రంప్‌ అందుకున్న బహుమతుల జాబితాలో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.