ETV Bharat / international

టిక్​టాక్​ ఛాలెంజ్​.. బాత్​రూంలో ఇలాంటి పనులా?

టిక్​టాక్​... ప్రపంచ దేశాల్లో దీనికున్న క్రేజే వేరు. దీనితో రాత్రికి రాత్రే స్టార్స్​గా ఎదిగిన వారెందరో ఉన్నారు. టిక్​టాక్​ ఛాలెంజ్​లకు కూడా అంతే క్రేజ్​ ఉంటుంది. అయితే అమెరికాలోని స్కూళ్లల్లో ప్రస్తుతం ఓ టిక్​టాక్​ ఛాలెంజ్​ నడుస్తోంది. దానిని సీరియస్​గా తీసుకున్న విద్యార్థులు.. అక్కడి సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంకాక.. వారు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఆ ఛాలెంజ్​ ఏంటి? అంతలా విద్యార్థులు ఏం చేస్తున్నారు?

TikTok bathroom trend
టిక్​టాక్​ ఛాలెంజ్​
author img

By

Published : Sep 18, 2021, 1:25 PM IST

అమెరికాలో ఈ మధ్య కాలంలో 'డీవియంట్​ లిక్​' అనే టిక్​టాక్​ ఛాలెంజ్​కు విపరీతమైన క్రేజ్​ లభిస్తోంది. స్కూళ్ల ఆస్తులు.. ముఖ్యంగా బాత్​రూంలోని వస్తువులను దొంగిలించి తీసుకెళ్లిపోవడం ఈ ఛాలెంజ్​ థీమ్​. దీన్ని అక్కడి విద్యార్థులు చాలా సీరియస్​గానే తీసుకున్నారు. స్కూళ్లల్లోని బాత్​రూంలలో వస్తువులను ఎత్తికెళ్లిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతున్నాయి.

TikTok bathroom trend
ఇందుకే బాత్​రూంలు మూసేసింది..!
TikTok bathroom trend
సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్న విద్యార్థులు

పోర్ట్​ వాషింగ్టన్​ హైస్కూల్​లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ఇంకొన్ని రోజుల పాటు ఇదే కొనసాగితే.. బాత్​రూంలు మూసేయాల్సి వస్తుందని స్వయంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రకటన చేశారు.

TikTok bathroom trend
బాత్​రూంలను మూసేసిన యాజమాన్యం

"టిక్​టాక్​లో ఇలాంటివి చూడటం ఇదే తొలిసారి. వీటి వల్ల మా స్కూల్​పై, విద్యార్థులపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. వాస్తవానికి ఇక్కడున్న విద్యార్థుల్లో చాలా మంది మంచివారే. కొంతమంది మాత్రమే ఇలా చేస్తున్నారు. ఇదే కొనసాగితే బాత్​రూంలు మూసేయాల్సి వస్తుంది."

-- థాడ్​ గాబ్రియెల్​, పోర్ట్​ వాషింగ్టన్​ స్కూల్​ ప్రిన్సిపాల్​.

దొంగిలించిన వస్తువులు ఈ నెల 20లోగా తిరిగివ్వాలని ఆదేశించారు గాబ్రియెల్​. విద్యార్థులు సహకరించాలని, పరిస్థితి చేయి దాటిపోతే కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతూ తల్లిదండ్రులకు లేఖలు పంపించారు.

TikTok bathroom trend
బాత్​రూంలో వస్తువులను ఎత్తుకెళ్లిన విద్యార్థులు

వౌకేశ ప్రాంతంలోని హార్నింగ్​ మిడిల్​ స్కూల్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బాత్​రూం వస్తువులను దొంగలించకూడదని తమ పిల్లలకు చెప్పాలంటూ.. తల్లిదండ్రులకు లేఖలు పంపారు.

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.