మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. మెట్రో వంతెన పైనుంచి రైలు కిందపడి 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 70 మందికి గాయాలయ్యాయి.
మెక్సికో నగరంలోని 12వ మెట్రో లైన్లో సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో.. ఉన్నట్టుండి రైలు వంతెన కుప్పకూలింది. అదే సమయంలో దానిపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు.. రహదారిపైనున్న వాహనాలపై పడింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై ఆ దేశ విదేశాంగ మంత్రి మార్సెలో విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బస్సు ప్రమాదం-11 మంది మృతి