కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇటీవల గణనీయమైన పురోగతి కనిపించిందన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్. అందులో పలు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్ చివర్లో లేదా జనవరి తొలినాళ్లలోనే టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు సరైన ప్రణాళికను రూపొందించాలని, అది తాము చేసి తీరుతామన్నారు బైడెన్. అయితే.. దానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి:'70శాతం మంది మాస్కు వాడితే కరోనా అంతం'