కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అమెరికాలో టీకా పంపిణీ ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో తొలి వ్యాక్సిన్ అందించినట్లు ట్వీట్ చేశారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
-
First Vaccine Administered. Congratulations USA! Congratulations WORLD!
— Donald J. Trump (@realDonaldTrump) December 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">First Vaccine Administered. Congratulations USA! Congratulations WORLD!
— Donald J. Trump (@realDonaldTrump) December 14, 2020First Vaccine Administered. Congratulations USA! Congratulations WORLD!
— Donald J. Trump (@realDonaldTrump) December 14, 2020
టీకాను తొలుత ఆరోగ్య సిబ్బందికి అందిస్తున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని జెవిష్ మెడికల్ సెంటర్లో పని చేస్తోన్న సాండ్రా లిండ్సే అనే నర్సు టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా 'నేను ఈ రోజు ఎంతో ధైర్యంతో ఉన్నాను' అని పేర్కొన్నారు నర్సు. ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వర్చువల్గా పర్యవేక్షించారు గవర్నర్ ఆండ్రూ క్యూమో.
వ్యాక్సిన్ పొందుతున్న వారిలో తాను ఒకడినని పేర్కొన్నారు ఫైజర్ సీఈఓ ఆల్బెర్ట్ బౌర్లా. సీఈఓ టీకా తీసుకోవటం వల్ల ప్రజలు మరింత నమ్మకంతో ఉంటారని తెలిపారు.
ఫైజర్ టీకాకు ఇటీవల అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)ఆమోదం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది అమెరికా. ఇప్పటికీ రోజుకు దాదాపు 2 లక్షల మందికి వైరస్ సోకుతోంది. సుమారు 3వేల వరకు మరణిస్తున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.67 కోట్లు దాటగా.. మరణాలు 3 లక్షలు దాటాయి. ఈ తరుణంలో టీకా పంపిణీ ప్రారంభం కావటం ఊరట కలిగించే విషయం.
ఇదీ చూడండి: ట్రంప్ అధికారులకే మొదటగా కరోనా వ్యాక్సిన్ !