మంచు తుపాను ధాటికి విలవిల్లాడిన అమెరికాలోని పలు దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. విద్యుత్తు పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు. అయితే టెక్సాస్‌లో దాదాపు 3.25 లక్షల నివాసాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు ఇంకా విద్యుత్తుకు దూరంగానే ఉన్నాయి. క్రమంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్తు అందిచే చర్యలు తీసుకుంటామని.. కాస్త సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు టెక్సాస్‌లోని ప్రజలకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. సురక్షిత తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోవడం వల్ల తాగునీరు సరఫరా కావడం లేదని యంత్రాంగం పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య ఉత్పన్నమైనట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: సెనేట్ పదవికి పోటీ చేయను: ఇవాంక