ETV Bharat / international

అమెరికాలోని ఆ రాష్ట్రంలో మిలియన్​ కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కొవిడ్ మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 10 లక్షలకు చేరువవ్వగా.. కొవిడ్​ మరణాల సంఖ్య 12.65 లక్షలకు పెరిగింది. అమెరికాలో 10 లక్షల కరోనా కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా టెక్సాన్ నిలిచింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్​ జెలెన్స్కికి.. తనకు కరోనా సోకిందని ప్రకటించారు.

total covid cases in the world
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం
author img

By

Published : Nov 9, 2020, 10:54 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 50,952,284 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. అందులో 1,264,959 మంది ప్రాణాలు కోల్పోయారు. 35,909,848 మంది కొవిడ్​ నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం 13,777,477 మంది చికిత్స పొందుతున్నారు.

అమెరికాలో కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. టెక్సాస్​లో మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలు దాటాయి. అమెరికాలో మిలియన్ కరోనా కేసులు దాటిన తొలి రాష్ట్రం ఇదే కావడం గమనార్హం.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్​ జెలెన్స్కికి తనకు కరోనా సోకిందని ప్రకటించారు. కరోనా నిబంధనలు పాటించినప్పటికీ తాను కరోనా బారిన పడినట్టు వివరించారు. కొవిడ్​ 19కు ఎవరూ అతితం కాదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

శ్రీలంక రాజధానిలో లాక్​డౌన్ ఎత్తేసినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. గడిచిన 10 రోజుల్లో ఈ నిబంధనలు ఉల్లంఘించిన 120 మందికి శిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. నిబంధనలు పాటించకుండా బయట తిరిగితే 54 డాలర్ల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో రెండూ పడొచ్చని హెచ్చరించారు అక్కడి అధికారులు.

ప్రపంచ దేశాల్లో కవిడ్ విజృంభణ ఇలా..

  • అమెరికాలో ఇప్పటి వరకు మొత్తం 10,300,634 మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 243,811 చేరింది.
  • బ్రెజిల్​లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కేసుల సంఖ్య 5,664,115 దాటింది. మరణాలు 162,937గా ఉన్నాయి.
  • రష్యాలో ఇప్పటి వరకు కరోనాతో 30,793 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18 లక్షలకు సమీపిస్తోంది.
  • ఫ్రాన్స్​లో కరోనా కేసులు 1,787,411గా ఉండగా.. కొవిడ్​తో 40, 439 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొత్తం కేసులు 9.60 లక్షల మార్క్​ పైకి చేరాయి. మరణాలు 41,750గా నమోదయ్యాయి.
  • ఇరాన్​లో కొవిడ్ కేసులు ఏడు లక్షలకు చేరువవుతున్నాయి. ఈ దేశంలో కరోనా ధాటికి 38,749 మంది బలయ్యారు.

ఇదీ చూడండి:ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.