ETV Bharat / international

హక్కుల కోసం ఎల్​జీబీటీల ప్రపంచవ్యాప్త ఉద్యమం - గే

ప్రపచం వ్యాప్తంగా ట్రాన్స్​జెండర్లు ప్రైడ్​ పరేడ్​ నిర్వహించారు. ఈ కవాతులో వేలాది మంది పాల్గొన్నారు. మెక్సికోలో వందల మంది రోడ్లపైకి వచ్చి ప్రదర్శన నిర్వహించారు. భారత్​లోని కోల్​కతాలో  ట్రాన్స్​జెండర్లు పరేడ్​ చేశారు.

ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్​జెండర్ల ప్రైడ్​ పరేడ్
author img

By

Published : Jun 30, 2019, 2:22 PM IST

ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్​జెండర్ల ప్రైడ్​ పరేడ్

ట్రాన్స్​జెండర్ల 'ప్రైడ్​ పరేడ్'​ను పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది స్వలింగ సంపర్కులు కవాతు నిర్వహించారు. పెరూలో 2 వేల మంది కవాతులో పాల్గొన్నారు. మెక్సికోతో పాటు ఉత్తర మెసడోనియా రాజధాని నగరంలో నిర్వహించిన పరేడ్​లో వందల మంది ట్రాన్స్​జెండర్లు పాల్గొన్నారు. స్వలింగుల గుర్తింపు, హక్కుల సాధనే.. లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

మెక్సికోలోని పాసియో డీ లా రిఫార్మ్​ నగరంలో ఇంద్రధనుస్సు రంగుల జెండాలు, గొడుగులు పట్టుకుని వీధుల్లో కవాతు నిర్వహించారు ట్రాన్స్​జెండర్లు. సంగీతానికి తగినట్లు నృత్యాలు చేశారు. ట్రాన్స్​జెండర్ల హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్రాన్స్​జెండర్ల సంఘాలకు మెక్సికో ప్రభుత్వం 2007లో చట్టబద్ధత కల్పించింది. 'గే' వివాహాలకు 2009లో అనుమతి ఇచ్చింది. అయితే సమాజంలో తమను గౌరవించడం లేదని ట్రాన్స్​జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

" ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఎంతో శ్రమించాలి. ఇంకా పురుషుల ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంది. ఇప్పటికీ మాకు గుర్తింపు రావటం లేదు. విభిన్న లైంగిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తులుగా మాకు ఉన్న ఈ అడ్డంకులను ఎదుర్కోవటానికి ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాము. ఇలా చేయడం ద్వారా ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. తమను సమాజానికి ముప్పుగా అనుకోరు. "

- మోనికా నోచెబునా, కవాతులో పాల్గొన్న వ్యక్తి

అమెరికాలోని న్యూయార్క్​లో ఎల్​జీబీటీ హక్కుల సాధనకు తలపెట్టిన ఉద్యమం 50వ వార్షికోత్సం సందర్భంగా శనివారం పరేడ్​ నిర్విహించారు. భారత్​ నుంచి ఐరోపా వరకు వివిధ దేశాల్లో కవాతు చేపట్టారు.

కోల్​కతాలో...

భారత్​లో మొదటి ట్రాన్స్​జెండర్ల ప్రైడ్​ పరేడ్​ నిర్వహించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బంగాల్​లోని కోల్​కతాలో ఎల్​జీబీటీలు పరేడ్​ నిర్వహించారు. ఈ కవాతులో ట్రాన్స్​జెండర్లతో పాటు స్థానికులూ పాల్గొన్నారు. 'వాక్​ ఆన్​ ద రెయిన్​బో' అని రాసి ఉన్న పసుపు రంగు టీ షర్టులను ధరించి కవాతు చేపట్టారు.

ఇదీ చూడండి: రష్యాను ముంచెత్తిన వర్షాలు- నీట మునిగిన వేల ఇళ్లు

Intro:Body:

tyty

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.