అఫ్గానిస్థాన్‌లో పాలనను చేజిక్కించుకున్న తాలిబన్లు(Modi Taliban news).. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారత్, అమెరికా సూచించాయి. మహిళలు, చిన్నారులు సహా పౌరుల హక్కులను గౌరవించాలని హితవు పలికాయి. అఫ్గాన్‌ను ఉగ్రవాదుల శిక్షణకు స్థావరంగా (Terrorism in Afghanistan) మార్చొద్దని తేల్చి చెప్పాయి. ఇతర దేశాలకు ముప్పు తలపెట్టే శక్తులకు అఫ్గాన్ భూభాగాన్ని కేంద్రంగా మార్చొద్దని సూచించాయి. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(Modi in USA), అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ (Terrorism in Afghanistan) శుక్రవారం తొలిసారి ముఖాముఖీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన వారు అఫ్గాన్‌లో ఉగ్రవాదంపై ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మేరకు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఉగ్రవాద నిర్మూలనకు తాలిబన్ ప్రభుత్వం(Afghan Taliban) కృషి చేయాలని భారత్- అమెరికా సూచించాయి. ఉగ్రమూకలకు నిధుల అందజేతనూ అడ్డుకోవాలని స్పష్టం చేశాయి. అలాగే అఫ్గానిస్థాన్‌ను(Afghanistan News) వీడాలనుకుంటున్న అఫ్గాన్లు, విదేశీయులను సురక్షితంగా పంపాలని కోరాయి. అఫ్గానిస్థాన్‌కు మానవతా దృక్పథంతో అందే సాయాన్ని తాలిబన్లు అనుమతించాలని హితవు పలికాయి. శాంతియుతమైన అఫ్గాన్ నిర్మాణంలో ఇతర మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి.
ఇవీ చదవండి: