ETV Bharat / international

'అఫ్గాన్​లో పట్టుబిగిస్తున్న తాలిబాన్లు' - అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్​లో తాలిబాన్ల ఆక్రమణలు ఊహించని స్థాయిలో పెరిగాయని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. అఫ్గాన్​ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

talibans, afghanistan
తాలిబాన్లు, అఫ్గానిస్థాన్
author img

By

Published : Jul 12, 2021, 5:41 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబాన్ల ఆక్రమణల జోరు కొనసాగుతోంది. దాదాపు 85 శాతం భూభాగాన్ని హస్తగతం చేసుకున్నట్లు ఇటీవలే తాలిబాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేసింది అమెరికా రక్షణ రంగ విభాగం పెంటగాన్. అఫ్గాన్​ ప్రభుత్వం వల్లే ఇలా జరుగుతోందని, ఇందులో సైన్యం తప్పేమీలేదని ఆరోపించింది.

"తాలిబాన్ల దురాక్రమణలను నిశితంగా పరిశీలిస్తున్నాం. అఫ్గాన్​లో భద్రత క్రమంగా లోపిస్తోంది. దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గాన్​ పాలకులతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాం. వారు తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకురాగలరని నమ్ముతున్నాం. అఫ్గాన్​ ప్రభుత్వం తమ ప్రజల కోసం పోరాడే సమయం ఆసన్నమైంది."

--జాన్ కిర్బీ, పెంటగాన్ సమాచార ప్రతినిధి.

అమెరికా, నాటో దేశాలు బలగాల ఉపసంహరణ ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా అఫ్గాన్​ బలగాలకు, తాలిబాన్లకు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. తాలిబన్‌ ఉగ్రవాదులతో తలపడలేక ఇప్పటివరకు అనేక మంది అఫ్గాన్​ సైనికులు పొరుగు దేశాలకు పారిపోయారు.

అయితే.. ఆగస్టు 31 కల్లా అఫ్గాన్​ నుంచి తమ సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించనున్నట్లు బైడెన్​ ఇటీవలే ప్రకటించడం గమనార్హం.

ఇదీ చదవండి:తాలిబన్ల ఏరివేత.. 109 మంది హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.