ETV Bharat / international

పాఠశాలలో కాల్పులు: తోటి విద్యార్థులే నిందితులు - gun fire

అమెరికా కొలరాడో రాష్ట్రం డెన్వర్​లో కాల్పులకు పాల్పడింది పాఠశాల విద్యార్థులేనని పోలీసులు తేల్చారు. ఇద్దరు విద్యార్థులు రెండు తరగతి గదుల్లోకి చొరబడి కాల్పులు జరిపినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పాఠశాలలో కాల్పులు: తోటి విద్యార్థులే నిందితులు
author img

By

Published : May 8, 2019, 2:42 PM IST

Updated : May 8, 2019, 3:19 PM IST

పాఠశాలలో కాల్పులు: తోటి విద్యార్థులే నిందితులు

అమెరికాలో తుపాకీ విష సంస్కృతి నానాటికీ పెరిగిపోతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా తుపాకులు వినియెగిస్తూ... విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా కొలరాడో రాష్ట్రం డెన్వర్​లోని పాఠశాలలో కాల్పులకు పాల్పడింది అక్కడి విద్యార్థులేనని తేలింది.

స్టెమ్​ పాఠశాలలో 18 ఏళ్లు కూడా నిండని ఇద్దరు విద్యార్థులు... తోటివారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి సమయంలో పాఠశాలలో 1,850 మంది విద్యార్థులు ఉన్నారు.

కాల్పుల వార్తలతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లల ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు పాఠశాలకు పరుగెత్తుకొచ్చారు.

ఉత్తర కరోలినా షార్లెట్​ విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరిపి ఇద్దరు విద్యార్థులను పొట్టనబెట్టుకుని సరిగ్గా వారం రోజుల అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇదీ చూడండి: పాక్​లో ఆత్మాహుతి దాడి- 10 మంది మృతి

Intro:Body:Conclusion:
Last Updated : May 8, 2019, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.