ETV Bharat / international

స్పేస్ఎక్స్ ప్రయోగం బుధవారానికి వాయిదా - స్పేస్​ఎక్స్​ అంతరిక్ష యాత్ర

స్పేస్​ఎక్స్ ఆదివారం చేపట్టనున్న​ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ఈ యాత్రను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పేస్​ఎక్స్ తెలిపింది.

SpaceX
స్పేస్​ఎక్స్
author img

By

Published : Oct 30, 2021, 10:25 PM IST

అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్​ఎక్స్​.. నాసాతో కలిసి చేపట్టనున్న అంతరిక్ష యాత్ర బుధవారానికి వాయిదా పడింది. వందలాది మైళ్ల మేర భారీ ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.

షెడ్యూల్​ ప్రకారం.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఆరు నెలల మిషన్​లో భాగంగా.. ఆదివారం ఉదయం నలుగురు వ్యోమగాములతో ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్‌లో వాతావరణం ప్రశాంతంగానే ఉన్నప్పటికీ... ఈశాన్య తీరంలో భారీ తుపాను బీభత్సం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మిషన్​ను వాయిదా వేస్తున్నట్లు శనివారం అధికారులు తెలిపారు.

బుధవారం వరకు వాతావరణం ప్రశాంతంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు ఈ యాత్ర చేపట్టనున్న ఒక జర్మన్​, ముగ్గురు అమెరికన్​ వ్యోమగాములు.. కెన్నెడీ స్పేస్ సెంటర్​లోనే ఉండనున్నారు. ఇది.. ఏడాదిన్నర వ్యవధిలో నాసాతో కలిసి స్పేస్ఎక్స్​ చేపట్టనున్న నాలుగో అంతరిక్ష యాత్ర కావడం గమనార్హం. కాగా.. ఇది స్పేస్​ఎక్స్​ ఐదో ప్యాసెంజర్ ఫ్లైట్​. గతనెలలో స్పేస్ఎక్స్​ తన మొదటి ప్రైవేట్​ విమానాన్ని అంతరిక్షంలోకి పంపింది.

ఇదీ చూడండి: స్పేస్​ఎక్స్​ తొలి ప్రైవేటు స్పేస్​ టూర్​ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.