ETV Bharat / international

అశ్రు నివాళుల మధ్య ఫ్లాయిడ్ అంత్యక్రియలు - వివక్ష వ్యతిరేక భావోద్వేగాల మధ్య ఫ్లాయిడ్ అంత్యక్రియలు పూర్తి

అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి బలైన ఆఫ్రో-అమెరికన్​ జార్జ్​ ఫ్లాయిడ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హ్యూస్టన్​కు సమీపంలోని పియరల్​లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివిధ దేశాల్లోని పలువురు ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్.. ఫ్లాయిడ్ మృతికి న్యాయం జరగాలని వీడియో సందేశం పంపారు.

floyd
వివక్ష వ్యతిరేక భావోద్వేగాల మధ్య ఫ్లాయిడ్ అంత్యక్రియలు పూర్తి
author img

By

Published : Jun 10, 2020, 9:35 AM IST

Updated : Jun 10, 2020, 9:56 AM IST

అమెరికాలో పోలీసు అమానుష ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. హ్యూస్టన్​కు సమీపంలోని పియరల్​ శ్మశానవాటికలో ఫ్లాయిడ్​కు క్రైస్తవ బోధకుడు షార్ప్​టన్​ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికగా ఫ్లాయిడ్.. ప్రజలందరికీ గుర్తుండిపోతారని ఆయన కుటుంబ సభ్యులు ఉద్ఘాటించారు.

అశ్రు నివాళుల మధ్య ఫ్లాయిడ్ అంత్యక్రియలు

ఆరు రోజులపాటు ఫ్లాయిడ్ సంతాప దినాలు నిర్వహించారు. తరువాత ఫ్లాయిడ్ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్, పెరిగిన హ్యూస్టన్, మరణించిన మిన్నియాపొలిస్​ నగరాల్లో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది తరలివచ్చి ఫ్లాయిడ్​కు నివాళులు అర్పించారు. ప్రముఖ నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్​, రాపర్ ట్రే థా ట్రూత్; రిపబ్లిక్ షీలా జాక్సన్​ లీ, హ్యూస్టన్ పోలీస్ చీఫ్​ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్​, గ్రామీ విజేత నే యో కూడా ఉన్నారు.

floyd
ఫ్లాయిడ్ అంతిమ యాత్ర

ఫ్లాయిడ్ మృతికి న్యాయం జరగాలి: బిడెన్

జాతి వివక్ష సమసిపోవాలని ఆకాంక్షించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న జో బిడెన్. ఫ్లాయిడ్ అంత్యక్రియల సందర్భంగా వీడియో సందేశం విడుదల చేశారు. ఫ్లాయిడ్​కు న్యాయం జరిగితే.. జాతి వివక్షకు వ్యతిరేకంగా అమెరికా ముందుకు సాగుతున్నట్లేనని పేర్కొన్నారు.

floyd
సమాధి స్థలానికి చేరుకున్న పార్థివ దేహం

ఫ్రాన్స్​లో సంఘీభావం..

ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో ఫ్లాయిడ్ మృతికి సంఘీభావం తెలిపారు నల్లజాతీయులు. 8 నిమిషాల 45 సెకన్లపాటు మౌనం పాటించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇటలీలో ప్రదర్శన

ఫ్లాయిడ్ అంత్యక్రియల సందర్భంగా ఇటలీలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ప్లాయిడ్ మృతికి న్యాయం జరగాలన్న నినాదంతో మాస్కులు ధరించి నిరసన చేపట్టారు.

బానిసల వ్యాపారి విగ్రహం తొలగింపు..

బ్రిటన్​ రాజధాని లండన్​లో ఓ బానిసల వ్యాపారి విగ్రహాన్ని తొలగించారు స్థానికులు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో పలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇదే కోవలో లండన్​లోని బానిసల వ్యాపారి విగ్రహాన్ని తొలగించారు నిరసనకారులు. జాతి వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎదుట కూడా నిరసనలు చేశారు ఆందోళనకారులు. జాతివివక్ష సమసిపోవాలని పేర్కొంటూ ర్యాలీ తీశారు.

ఇదీ చూడండి: వివాదాస్పద మ్యాపుపై నేపాల్ పార్లమెంటులో చర్చ

Last Updated : Jun 10, 2020, 9:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.