అమెరికా ఓక్లహోమాలో ఘోరం జరిగింది. మస్కోగీలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ ఓ మహిళను ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగింది?
మస్కోగిలో కాల్పులు జరుగుతున్నట్లు రాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వచ్చేసరికి తుపాకితో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో నలుగురు చిన్నారులు సహా ఓ వ్యక్తి మృతదేహాన్నిపోలీసులు గుర్తించారు. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే దుండగుడి వివరాలను పోలీసులు ఇంకా ప్రకటించలేదు.