ETV Bharat / international

కరోనా కల్లోలానికి త్వరలో తెర!... ఇవే సంకేతాలు

ఐరోపా, అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. అయితే.. ఆయా దేశాల్లో మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పాజిటివ్​ కేసులూ కొంతమేర తగ్గాయి. ఫలితంగా కరోనాపై పోరులో ప్రపంచ దేశాల పోరులో తొలిసారి ఆశలు చిగురించాయి.

SIGNS OF HOPE AMID CORONA VIRUS OUTBREAK IN THE WORLD
కరోనా కల్లోలంలోనూ.. ఆశలు చిగురించేన్​!
author img

By

Published : Apr 10, 2020, 2:49 PM IST

Updated : Apr 10, 2020, 5:03 PM IST

కరోనా వైరస్​.. మూడు నెలలుగా ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి. చైనా నుంచి ఇటలీ, ఫ్రాన్స్​, స్పెయిన్​, అమెరికా అంటూ.. దాదాపు అన్ని ఖండాలను బెంబెలెత్తిస్తోంది ఈ వైరస్​. లాక్​డౌన్​, కర్ఫ్యూ అని తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలనూ ఉపయోగించేశాయి ప్రపంచ దేశాలు. అయినప్పటికీ.. ఐరోపా, అమెరికాలో నిన్న మొన్నటి వరకు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి.

ఇంత కల్లోలంలో ఒక్కసారిగా ఆశలు చిగురించాయ్​. మానవాళి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కగలదన్న విశ్వాసం పెరిగింది. ఇందుకు కారణం ఐరోపా, అమెరికాల్లో రోజువారీ మృతుల సంఖ్య కొంతమేర తగ్గడం. మునుపటితో పోల్చితే పాజిటివ్​ కేసులూ కాస్త తగ్గాయి.

స్పెయిన్​లో మృతుల సంఖ్య 15వేలు దాటింది. అయితే బుధవారం 757 మంది మరణించగా.. గురువారం ఆ సంఖ్య 683కు తగ్గింది. దీనిపై ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్​ స్పందించారు.

"వైరస్​ నియంత్రణలోకి వస్తోంది. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో వెనక్కి తిరగకపోవడమే ముఖ్యం. పరిస్థితి తిరిగి మొదటికి రాకూడదు."

--- పెడ్రో సాంచెజ్​, స్పెయిన్​ ప్రధాని.

బ్రిటన్​లో...

బ్రిటన్​లో అత్యంత సానుకూల విషయం.. ఆ దేశ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆరోగ్యం కుదుటపడటం. మూడు రోజుల పాటు ఐసీయూలో చికిత్స అనంతరం ప్రధానిని సాధారణ వార్డుకు మార్చారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా 15లక్షల మందికిపైగా బాధితుల్లో స్ఫూర్తి నింపుతోంది.

అమెరికాలో 24 గంటల వ్యవధిలో 1900మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే బుధవారంతో పోల్చితే ఇది కొంత తక్కువే. ఈ నేపథ్యంలో.. అమెరికా సరైన మార్గంలో పయనిస్తున్నట్టు అగ్రరాజ్యం ఉన్నతాధికారి ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు.

అమెరికాలో వైరస్​ కేంద్రబిందువైన న్యూయార్క్​లోనూ పరిస్థితులు కొంతమేర మెరుగుపడ్డాయి. తాజాగా 799మంది మరణించినప్పటికీ.. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తొలిసారిగా తగ్గింది. దీంతో తమ చర్యలు ఫలించాయని ఆ రాష్ట్ర గవర్నర్​ ఆండ్రూ కౌమో తెలిపారు. ఇదే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి:- 'బయో ఉగ్రదాడికి ట్రైలర్​ ఈ కరోనా సంక్షోభం'

Last Updated : Apr 10, 2020, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.