అమెరికాలోని అలస్కాలో రెండు చిన్న విమానాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.27 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. స్టెర్లింగ్ హైవే వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపాయి.
ఒక విమానంలో ఒక్కరే ఉండగా మరో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మొత్తం ఆరుగురు మరణించారని ప్రజా సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు వెల్లడించాయి.
మృతుల్లో శాసనసభ్యుడు గ్యారీ క్నాప్ సైతం ఉన్నట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై జాతీయ రవాణా సంక్షేమ బోర్డు దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తా కథనాలు స్పష్టం చేశాయి. అలస్కా ప్రతినిధుల సభలో గ్యారీ క్నాప్ సభ్యుడిగా ఉన్నారు.
ఇదీ చదవండి: చైనా విషయంలో భారత్కు అగ్రరాజ్యం సంపూర్ణ మద్దతు