ETV Bharat / international

శ్వేతసౌధంలో పెరుగుతున్న కరోనా కేసులు - శ్వేతసౌధంలో భారీగా కరోనా కేసులు

వైట్​హౌస్​ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్​కు కరోనా నిర్ధరణ అయింది. మంగళవారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్​గా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ దంపతులు సహా శ్వేతసౌధంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Senior White House Adviser Stephen Miller tests positive for COVID-19
శ్వేతసౌధ సీనియర్ సలహారుడికి కరోనా
author img

By

Published : Oct 7, 2020, 8:01 AM IST

శ్వేతసౌధంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా.. శ్వేతసౌధ సీనియర్ సలహాదారుడు స్టీఫెన్ మిల్లర్​కు కరోనా సోకినట్లు తెేలింది. పరీక్షల్లో తనకు పాజిటివ్​గా వచ్చిన విషయాన్ని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు స్టీఫెన్. గత ఐదు రోజులుగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి వచ్చిందని, ప్రతీరోజు పరీక్షలు చేయించుకున్నానని వివరించారు.

వైట్​హౌస్​లో ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్​నకు కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. కరోనా లక్షణాలు కొంచెం ఎక్కువ ఉన్నందున ట్రంప్‌ ఈ నెల 2న వాషింగ్టన్‌లోని వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. అక్టోబర్ 6న డిశ్ఛార్జి అయ్యారు.

మీడియా కార్యదర్శి కెలీ మెకెననీకి సోమవారం కరోనా సోకినట్టు నిర్ధరణ అయింది. మీడియా సహాయ కార్యదర్శి కరోలీన్ లీవిట్, చాడ్ గిల్​మార్టిన్​లతో పాటు ట్రంప్ సలహాదారులు హోప్ హిక్స్, నికోలస్ లూనా కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో.. ట్రంప్​నకు సన్నిహితంగా ఉండే వారిలో క్యాంపెయిన్ మేనేజర్ బిల్ స్టెపియెన్, ట్రంప్ మాజీ సలహాదారు కెల్యాన్నె కాన్​వే, రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ ఛైర్​వుమన్ రోనా మెక్​డేనియల్​లకు కూడా కొవిడ్ నిర్ధరణ అయింది.

ఇవీ చదవండి-

సైనిక ఆస్పత్రి నుంచి ట్రంప్ డిశ్ఛార్జి

ట్రంప్ క్వారంటైన్ ఎన్ని రోజులు?​ నెక్ట్స్​ ఏంటి?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.