ETV Bharat / international

ట్రంప్​ను నిర్దోషిగా ప్రకటించిన సెనేట్ - డొనాల్డ్ ట్రంప్​ అభిశంసనపై సెనేట్

క్యాపిటల్​ ఘటనకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను నిర్దోషిగా తేల్చింది సెనేట్​. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది.

Senate acquits Trump for inciting Capitol riot
ట్రంప్​ అభిశంసన: నిర్దోషిగా తేల్చిన సెనేట్
author img

By

Published : Feb 14, 2021, 4:55 AM IST

Updated : Feb 14, 2021, 6:02 AM IST

జనవరి 6న క్యాపిటల్ దాడి ఘటనలో ఆందోళనకారులను ప్రేరేపించారన్న అభియోగాలకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను సెనేట్ నిర్దోషిగా తేల్చింది. ట్రంప్‌ను అభిశంసించేందుకు ఉద్దేశించిన తీర్మానం 57-43 తేడాతో వీగిపోయింది. ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని నాలుగురోజులపాటు విచారించిన సెనేట్ చివరకు మాజీ అధ్యక్షుడిని నిర్దోషిగా తేల్చింది.

మెుత్తం 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ట్రంప్‌పై అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటువేయగా అనుకూలంగా 43 ఓటు వేశారు. దీంతో శిక్షకు అవసరమైన మూడింట రెండు వంతుల కంటే 10 ఓట్ల తక్కువ రావడం వల్ల అభిశంసన వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్ సెనెటర్లు ట్రంప్‌ను అభిశంసించడానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ.. అవసరమైన 67 ఓట్లు రాలేదు.

ఇదీ చదవండి:సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

అగ్రరాజ్య అధ్యక్షుల చరిత్రలోనే రెండుసార్లు అభిశంసనను ఎదుర్కొన్న వ్యక్తి ట్రంప్‌ కాగా పదవీవిరమణ అనంతరం కూడా అభిశంసనని ఎదుర్కొన్న వ్యక్తిగానూ‌ నిలవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తనను నిర్దోషిగా ప్రకటించిన వెంటనే ట్రంప్​ ఓ కీలక ప్రకటన చేశారు. తాను అస్థిరమైన చట్టాలకు వ్యతిరేకంగా ఉంటానని అన్నారు. శాంతియుతంగా పలు సమస్యలపై చర్చించే హక్కు అమెరికా చట్ట సభ్యులకు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే మరో అధ్యాయమని పేర్కొన్నారు. న్యాయాన్ని, సత్యాన్ని సమర్ధిస్తూ తనకోసం పనిచేసిన న్యాయవాదులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ట్రంప్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి:

ట్రంప్​ అభిశంసన: మూడు గంటల్లో ముగిసిన విచారణ'

అభిశంసన'లో ట్విస్ట్- ట్రంప్​కు సొంత​ లాయర్​ షాక్​!

Last Updated : Feb 14, 2021, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.