ETV Bharat / international

అమెరికా ఎన్నికల వేళ.. భద్రత ఇలా..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దశాబ్దాల తరబడి ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి, వర్ణవివక్ష నిరసనలు తదితర పరిణామాలతో ఈ సారి భయాందోళనలు నెలకొన్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్​ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా భత్రతను కట్టుదిట్టం చేశారు.

America elections
అమెరికా అధ్యక్ష ఎన్నికలు
author img

By

Published : Nov 2, 2020, 9:49 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దశాబ్దాల తరబడి ప్రశాంతంగానే జరుగుతూ వచ్చాయి. అయితే ఈమధ్య చోటుచేసుకున్న కరోనా మహమ్మారి, వర్ణవివక్ష నిరసనలు తదితర పరిణామాల వల్ల ఆ దేశంలో అశాంతి, భయాందోళనలు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఓడినట్లయితే అధికార బదలాయింపు శాంతియుతంగా ఉండగలదనే హామీ ఇచ్చేందుకు స్వయానా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపే నిరాకరించారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు రణరంగానికి వేదిక కాగలవనే భయం అమెరికన్లలో వ్యక్తమౌతోంది. పోలింగ్‌ గంటల వ్యవధిలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచార పర్వం ముగిసి భద్రతా చర్యలు ఊపందుకున్నాయి. ఎన్నికల పర్యవసానంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినా ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు, దీపస్థంభాలు తదితరాలపై హెచ్చరిక చిహ్నాలను ఏర్పాటుచేశారు.

అవాంఛనీయ ఘటనల సమాచారం లేదు

రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్ష నివాసం శ్వేతసౌధం చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రదర్శనకారులు దానిపై ట్రంప్‌ వ్యతిరేక ప్లకార్డులను ఏర్పాటు చేయటం గమనార్హం. ఇక ఇక్కడి వ్యాపార, వాణిజ్య వర్గాలు దుకాణాలను మూసివేశాయి. అదనపు భద్రతా ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరుగనున్నట్టు తమకు నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారమేదీ లేదని నగర ఉపమేయర్‌ జాన్‌ ఫాల్సిచినో తెలిపారు. అయితే తాము అప్రమత్తంగా ఉంటామని ఆయన వెల్లడించారు. ఇక్కడి భవనాల స్వంతదారులు, వ్యాపారస్తుల భయాందోళనలను తాము అర్థం చేసుకోగలమని.. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన కోరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అత్యంత పటిష్ఠమైన ఏర్పాట్లు ఉన్నాయని ఉపమేయర్‌ వివరించారు.

ఇదీ చూడండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.