ETV Bharat / international

ట్రంప్​ వెండితెర ఆశలపై 'ఎస్​ఏజీ' నీళ్లు!

author img

By

Published : Jan 20, 2021, 5:12 PM IST

ట్రంప్​కు మరో ఎదురు దెబ్బతగిలింది. అధ్యక్ష పదవిపోయినా .. పూర్వానుభవంతో సినిమాల్లో నటిద్దామనుకున్న ఆయనకు ఆ ఛాన్స్​ కూడా లేకుండా చేస్తోంది అమెరికా మూవీ అసోసియేషన్​ స్క్రీన్​ యాక్టర్స్​ గిల్డ్(ఎస్​ఏజీ). క్యాపిటల్​ భవనం మీద దాడికి ట్రంప్​ కారకుడని భావిస్తున్న ఆ సంస్థ.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తీర్మానించింది.

Screen Actors Guild may discipline, expel Donald Trump
ట్రంప్​కు మరో ఎదురు దెబ్బ!

అధ్యక్ష పదవిపోయినా.. సినిమాలలోనన్నా నటిద్దామనుకున్న ట్రంప్​ ఆశలపై అమెరికా మూవీ అసోసియేషన్​ స్క్రీన్​ యాక్టర్స్ గిల్డ్​ నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తోంది. అసోసియేషన్​లో ట్రంప్​కు ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేయడానికి తీర్మానించింది. క్యాపిటల్​ భవనం మీద దాడి జరగడానికి ట్రంప్​ కారణమనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఎస్​ఏజీ. ట్రంప్​ గతంలో సినిమాల్లో నటించే వారు. టీవీ కార్యక్రమాలను నిర్వహించేవారు. స్క్రీన్​ యాక్టర్స్​ గిల్డ్(ఎస్​ఏజీ) లో ట్రంప్​కు సభ్యత్వం ఉంది.

కాగా ట్రంప్​ ఇకపై సినిమాలు నటించకుండా.. టీవీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎస్ఏజీ నుంచి ట్రంప్​ను తొలగించడానికి తీర్మానించింది. ఆ సంస్థ క్రమశిక్షణ కమిటీ ముందుకు దీనికి సంబంధించి తీర్మానాన్ని పంపింది. ఒక వేళ కమిటీ విచారణలో ట్రంప్ దోషిగా తేలితే గిల్డ్​ సభ్యత్వాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది.

ట్రంప్​ నిర్లక్ష్యంగా ర్యాలీని నిర్వహించి.. అమెరికా క్యాపిటల్​ భవనంపై దుండగులు దాడి చేసేలా వారిని ప్రేరేపించారు. జర్నలిస్టుల భద్రతను ప్రమాదంలో నెట్టివేశారు. దీంతో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించాం.

-ఎస్​ఏజీ

అయితే సదరు సంస్థ ఆరోపణలపై శ్వేత సౌధం మీడియా అధికారిక ప్రతినిధి స్పందించలేదు. ఎస్​ఏజీ సభ్యత్వం లేవి వాళ్లు సినిమాలలో.. టీవీ షోలలో పాల్గొనకూడదనే నియమం లేదు. కాకపోతే ఆ సంఘ సభ్యలకున్న కొన్ని మినహాయింపులు సభ్యత్వం లేకుంటే ఉండవు.

ఈ సంస్థ(ఎస్​ఏజీ) అమెరికా ప్రజాస్వామ్యాన్ని, చట్టాల్ని గౌరవిస్తుంది. అలాంటి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ట్రంప్​ తీవ్రమైన దాడి చేశారు. అంతేకాకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేసి క్యాపిటల్​ భవనం మీద దాడి జరగడానికి కారకుడయ్యారు. మీడియా స్వేచ్ఛని ప్రమాదంలో పడేశారు.

-కార్టస్​, నటి

కాగా 1989 నుంచి ఎస్​ఏజీలో ట్రంప్​ సభ్యులుగా ఉన్నారు. ది అప్రెంటిస్​, సటర్​డేనైట్​ లైవ్​ షో లను ట్రంప్​ నిర్వహించారు. పలు చిత్రాలు, టీవీ సీరీస్​లలో అతిథి పాత్రలు పోషించారు. హోమ్​ ఎలోన్​2: లాస్ట్ట్ ఇన్​ న్యూయార్క్ చిత్రంలో , ది ఫ్రెష్​ ప్రిన్స్ ఆఫ్​ బెల్​ ఎయిర్​, సెక్స్​ ఇన్​ అండ్​ సిటీ టీవీ సిరీస్​లలో అతిథి పాత్రలు ట్రంప్​ పోషించారు.

ఇదీ చూడండి: ఆ సినిమాలో ట్రంప్​ సన్నివేశం తొలగింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.