ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్​ను వారిపై ప్రయోగించడం సబబేనా? - COVID-19 vaccine

కరోనాకు వ్యాక్సిన్... ఇప్పుడు అందరి లక్ష్యం, ఆశ ఇదే. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి వేర్వేరు సంస్థలు. ఇంతకీ... వ్యాక్సిన్​ అభివృద్ధి చేస్తే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం ఎలా? ఎవరిపై మొదట ప్రయోగించాలి? కరోనా సోకినవారికా? లేక వలంటీర్లకా? స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా... వారికి ఉద్దేశపూర్వకంగా కరోనా సోకేలా చేసి, ప్రయోగం నిర్వహించడం సరైనదేనా?

COVID-19 vaccine
కరోనా వ్యాక్సిన్
author img

By

Published : Apr 4, 2020, 7:24 PM IST

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రపంచదేశాలన్నీ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనైతిక ప్రతిపాదనలు వస్తున్నాయి. వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వారికి వైరస్ సంక్రమింపజేసి పరీక్షించాలని పలువురు సూచిస్తున్నారు.

అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుందని, కనీసం ఏడాది పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి బదులుగా వైరస్ తో బాధపడుతున్నవారికి ఇస్తే అతి తక్కువ సమయంలో కచ్చితమైన ఫలితాలు ఇస్తాయని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త స్టాన్లీ ప్లాట్కిన్ అభిప్రాయపడ్డారు.

సంప్రదాయ పద్ధతి..

ఇలాంటి ప్రతిపాదనే ఒకటి జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్​లో ప్రచురించారు. వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించే విధానం 2 శతాబ్దాల నుంచి నిర్వహిస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఇప్పటికీ కొన్ని అంటువ్యాధులకు ఈ పద్ధతినే పాటిస్తున్నాయని తెలిపారు.

ఎడ్వర్డ్ జెన్నర్.. వ్యాక్సిన్​కు ఆద్యుడు. మశూచి వ్యాధికి టీకా ఈయనే కనుగొన్నారు. ఆయన తొలుత 8 ఏళ్ల బాలుడిపై ప్రయోగించారు. ఆ సమయంలో ప్రాణాంతకమైన మశూచి నుంచి ఆ బాలుడు బయటపడ్డాడు. అయితే ఈ విధానంపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రోజుల్లో ఇటువంటి ప్రయోగాలు నైతిక సమీక్షలకు లోనవుతున్నాయి. శాస్త్రవేత్తలు కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ విషయంలో ఈ పద్ధతిని స్వీకరించలేకపోతున్నారు.

ఏమీ తెలియకుండా ఎలా?

అమెరికా అంటువ్యాధులు సంస్థలోని వైద్యులు మాథ్యూ మెమోలీ మరో భిన్నమైన వాదన వినిపించారు. కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని.. ఈ వైరస్ వల్ల మనుషులు తీవ్రంగా జబ్బు పడతారా లేదా దీర్ఘకాలం సమస్యలు వేధిస్తాయా అన్న స్పష్టత శాస్త్రవేత్తలకు లేదన్నారు.

ఈ సమయంలో ఒకరి శరీరంలోకి వైరస్​ను పంపి ప్రయోగాలు చేయాలంటే.. ముందుగా ఆ వ్యాధి గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మెమోలీ. అప్పుడే మనం ప్రమాద స్థాయిని అంచనా వేయగలమని చెప్పారు. మరో సీనియర్ శాస్త్రవేత్త కూడా ఈ రకమైన అభిప్రాయాన్నే వెలిబుచ్చారు.

"నాకు తెలిసి మనం చాలా వేగంగా వెళుతున్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ భారీగా వ్యాపిస్తోంది. వలంటీర్లపై ప్రయోగం నైతికమని నేను భావించను. మన పనిని వేగవంతం చేస్తుందని చెప్పలేను."

- మైరన్ లెవైన్, మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం

వారైతే ప్రమాదం తక్కువ..

ఈ సమస్యను అధిగమించేందుకు ఒక్కటే మార్గం ఉందని ప్లాట్కిన్​ సహా పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారికి వైరస్ అంత ప్రమాదకారిగా కనిపించట్లేదని.. అందువల్ల వారిపై పరీక్షలు చేయటమే ఉత్తమమని చెబుతున్నారు.

తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులపై ప్రయోగాలు చేయటం ఇంకా సులువైన మార్గమని అన్నారు. కరోనాకు సరైన ఔషధం లభించేందుకు ప్రమాదకరమైన ప్రయోగాలకూ ఆమోదం ఉంటుందని అన్నారు లెవైన్, మెమోలీ.

శిక్షణ తీసుకున్నవారైతే..

ఇటువంటి ప్రయోగాలకు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలైతే పని సులువవుతుందని నార్త్ వెస్ట్రన్ విశ్వ విద్యాలయం బయోఎథిసిస్ట్ సీమా షా అన్నారు. ప్రయోగాలకు సంబంధించి నైతిక బాధ్యత, సవాళ్లపై ఓ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.

"ప్రజలు ఇటువంటి పరీక్షలు అంతగా పరిచయం ఉండదు. ప్రయోగాలకు తగినట్లు వ్యవహరించే జ్ఞానం వారికి ఉండదు. వైద్యులు, శాస్త్రవేత్తలు ఉద్దేశాలను సరైన సహకారం లభించదు. అందువల్ల ఇటువంటి వాటికి శిక్షణ పొందినవారినే ఎంచుకోవటం సరైనది నా అభిప్రాయం."

- సీమా షా, బయోఎథిసిస్ట్

ఇదీ చూడండి: కోలుకున్నవారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.