ETV Bharat / international

మందుల్లేకుండానే హెచ్‌ఐవీ నుంచి విముక్తి! - హెచ్‌ఐవీని జయించిన మొదటి వ్యక్తి ఎవరు?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సాంక్రమిక వ్యాధి అయిన ఎయిడ్స్​ను జయించడం దాదాపు అసాధ్యమేననే భావన ఉంది. కానీ.. సరైన చికిత్సతో ఈ వ్యాధిని తరిమేయొచ్చని అంటున్నారు పరిశోధకులు. తాజాగా ఈ మహమ్మారి నుంచి బయటపడిన రెండో వ్యక్తిని గుర్తించారు అమెరికా శాస్త్రవేత్తలు.

hiv
హెచ్​ఐవీ
author img

By

Published : Nov 17, 2021, 7:14 AM IST

హెచ్‌ఐవీ సోకినట్టు తెలిస్తే చాలు.. మనసులో అలజడి, సమాజంలో ఛీత్కారాలు! బతుకుపై ఆశతో బాధితులు వైరస్‌తో సహజీవనం చేస్తూనే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యాంటీ-రిట్రోవైరల్‌ డ్రగ్స్‌ వాడుతుంటారు. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఎలాంటి ఔషధాలను వాడకుండానే.. హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందాడు! ఈ తరహా కేసుల్లో ఇది రెండోది కావడం విశేషం. వీరిద్దరిలో వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థలు ఎలా పనిచేశాయన్న రహస్యాన్ని తెలుసుకోగలిగితే.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

శరీరంలోకి ప్రవేశించిన హెచ్‌ఐవీ వైరస్‌... తన జన్యురాశిని ఇతర కణాల డీఎన్‌ఏలోకి చొప్పిస్తుంది. దీంతో అవి వైరల్‌ రిజర్వాయర్లుగా మారతాయి. తర్వాత వీటి నుంచి వైరస్‌ పుట్టుకొస్తుంది. అనేకానేక పరిశోధనల ఫలితంగా అందుబాటులోకి వచ్చిన యాంటీ-రిట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ).. ఈ రిజర్వాయర్లను లక్ష్యం చేసుకుంటుంది. వీటిని నాశనమైతే చేయలేదు. కానీ, కొత్తగా వైరస్‌ పుట్టుకురాకుండా అడ్డుకుంటుంది. అయితే, కొంతమంది రోగనిరోధక వ్యవస్థలు ఎలాంటి ఔషధాలు లేకుండానే.. తమంతట తాముగా హెచ్‌ఐవీని అణచివేస్తుంటాయి. ఇలాంటి వ్యక్తులను ‘ఎలైట్‌ కంట్రోలర్స్‌’గా పిలుస్తుంటారు. వీరిలో వైరల్‌ రిజర్వాయర్లు ఉన్నా, రోగనిరోధక శక్తికి సంబంధించిన టి-కణాలు.. ఔషధాలతో పనిలేకుండానే వైరస్‌ను అణచివేస్తాయి. ఇలా స్వస్థత పొందడాన్ని ‘స్టెరిలైజింగ్‌ క్యూర్‌’గా పిలుస్తారు. నిరుడు ఓ హెచ్‌ఐవీ బాధితురాలు ఈ విధానంలో స్వస్థత పొందినట్టు గుర్తించిన శాన్‌ఫ్రాన్సిస్కో పరిశోధకులు.. మరో వ్యక్తి కూడా స్టెరిలైజింగ్‌ క్యూర్‌ అయినట్టు తాజాగా ప్రకటించారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన 119 కోట్ల రక్త కణాలను, 50 కోట్ల కణజాల కణాలను పరీక్షించినా.. ఎక్కడా హెచ్‌ఐవీ జీనోమ్‌ జాడ కనిపించలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆశలు ఫలించేనా..?

"ఎలైట్‌ కంట్రోలర్స్‌లో స్టెరిలైజింగ్‌ క్యూర్‌ ఎలా జరుగుతోందన్నది లోతుగా తెలుసుకోగలిగితే.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు పరిష్కారం లభించినట్టే. వారిలో అత్యంత సహజంగా జరుగుతున్న ఈ పద్ధతిని అనుకరించి, మిగతా వారిని కూడా స్వస్థపరచవచ్చు. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. బాధితుల రోగనిరోధక వ్యవస్థలు తమంతట తాముగా స్టెరిలైజింగ్‌ క్యూర్‌ను చేపట్టేలా ప్రయోగాలు చేపడుతున్నాం. యాంటీ-రిట్రోవైరల్‌ థెరపీతో సంబంధం లేకుండా, వ్యాక్సినేషన్‌తోనే దీన్ని సాధిస్తామన్న నమ్మకం ఉంది" అని మసాచూసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణురాలు జూ యూ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.