ETV Bharat / international

కొవిడ్​కు మరో సమర్థ ఔషధం! - medicine for covid-19 latest news

కరోనా చికిత్సకు మరో ఔషధం అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయోగంలో పురోగతి సాధించారు శాస్త్రవేత్తలు. ఇన్​ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు వైరస్​ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు.

new medicine for Coronavirus
ఎంకే-4482
author img

By

Published : Apr 21, 2021, 9:22 AM IST

కొవిడ్​-19కు చికిత్స చేయడం కోసం మరో ఔషధం అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ఒక ముందడుగు వేశారు. ఇన్​ఫ్లూయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు వైరస్​ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవులపైనా క్లినికల్​ ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి తుది దశలో ఉన్నాయని వివరించారు.

మోల్నుపిరావిర్​(ఎంకే-4482) అనే ఈ ఔషధంపై అమెరికాలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్స్​ ఆఫ్​ హెల్త్​(ఎన్ఐహెచ్​), బ్రిటన్​లోని ప్లైమౌత్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా ఇది తగ్గిస్తుందని వారు చెప్పారు. కరోనా వైరస్​కు ప్రస్తుతం అనేకరకాల టీకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వైరస్​ వల్ల సోకే ఇన్​ఫెక్షన్​ను నయం చేయడానికి అన్ని సమర్థ ఔషధాలు లేవన్నారు. అందువల్ల తాజా ఆవిష్కారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించారు.

మాత్ర రూపంలో

ప్రస్తుతం రెమిడెసివిర్​ అనే యాంటీవైరల్​ ఔషధాన్ని కొవిడ్​ చికిత్స కోసం ఉపయోగిస్తున్నప్పటికీ దాన్ని.. ఇంజెక్షన్​ రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల అది ఆసుపత్రుల్లోనే ఇవ్వాలని తెలిపారు. అందుకు భిన్నంగా ఎంకే-4482 ఔషధం మాత్రరూపంలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీన్ని ఎలుకల్లో ప్రయోగించినప్పుడు వాటిలో సాంక్రమిక వైరస్​ స్థాయి వంద రెట్లు తగ్గినట్లు తేల్చారు. అలాగే మానవుల వ్యాప్తిలో ఉన్న ఇతర కరోనా వైరస్​లు, మెర్స్​, సార్స్​ వంటి వైరస్​ల పునరుత్పత్తిని అడ్డుకునే సామర్థ్యం దీనికి ఉందని వెల్లడైంది.

ఇదీ చూడండి: అత్యవసరమైతేనే భారత్​కు వెళ్లండి: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.