అమెరికా టెక్సాస్లోని ఓ ప్రాథమిక పాఠశాలకు భారతీయ-అమెరికన్ పేరు పెట్టనున్నారు. ప్రఖ్యాత ఫిజియోథెరపిస్ట్ సోనాల్ భూచర్కు ఈ అరుదైన గౌరవం దక్కడం విశేషం.
సోనాల్ దాతృత్వానికి గుర్తుగా పాఠశాలకు ఆమె పేరు పెట్టనున్నట్లు 'ది ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్' బోర్డు సభ్యులు వెల్లడించారు. 2023లో రివర్ స్టోన్ కమ్యూనిటీలో ఈ పాఠశాల ప్రారంభం కానుంది.
బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఫిజియోథెరపీ డిగ్రీ పట్టా పొందారు సోనాల్. ఆమె భర్త సుబోధ్ భూచర్తో 1984లో అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత విద్యార్థులు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
సోనల్ 2019లో క్యాన్సర్ కారణంగా మృతిచెందారు.