క్రిస్మస్ అనగానే పిల్లలకు శాంటాక్లాస్ గుర్తుకు వస్తాడు. మరి ఈ ఏడాది కరోనా కదా.. అందుకే పెరూ రాజధాని లీమాలో కొందరు వినూత్నంగా ఆలోచించారు. నగర శివార్లలోనే ప్లాస్టిక్ బబుల్లో శాంటాక్లాస్ను ఏర్పాటు చేశారు.
కరోనా భయం లేకుండా పిల్లలు క్రిస్మస్ తాతను దర్శించుకోగలుగుతున్నారు. తమ కోరికల చిట్టాను వదిలి, శాంటాతో ముచ్చటిస్తూ సందడి చేస్తున్నారు.
ఇదీ చదవండి:జూలో క్రిస్మస్ వేడుకలు.. జంతువులకు విందు