ETV Bharat / international

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ x జో బిడెన్ ​ - Bernie Sanders

అమెరికా ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డెమోక్రటిక్​ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో సాండర్స్​పై.. జో బిడెన్​ ఆధిక్యం సాధించారు. ఫలితంగా సాండర్స్ రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు​. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో జో బిడెన్ తలపడనున్నారు. ఈ ఏడాది నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Sanders drops out of White House race, Biden becomes presumptive Democratic prez nominee
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ను ఢీ కొట్టనున్న జో బిడెన్ ​
author img

By

Published : Apr 9, 2020, 6:04 AM IST

ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బిడెన్‌ తలపడనున్నారు. డెమోక్రాట్ల ప్రాథమిక ఎన్నికల్లో సెనేటర్‌ సాండర్స్‌పై బిడెన్ ఆధిక్యం సాధించారు. ఫలితంగా పార్టీ తరఫున అభ్యర్థి రేసు నుంచి బెర్నీ సాండర్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

పోరాటం ముగిసింది!

ఈ రేసులో తన పోరాటం ముగిసిందని ప్రకటించిన సాండర్స్‌.. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష పోటీ కోసం ఐదేళ్ల క్రితమే ప్రచారం ప్రారంభించారు సాండర్స్. కార్మిక వర్గంలో మంచి పేరు సంపాదించారు​.

సాండర్స్​ పోటీ నుంచి తప్పుకోవడంపై ట్రంప్​ స్పందించారు. హిల్లరీ క్లింటన్‌ మాదిరిగా బెర్నీ సాండర్స్‌ కథ కూడా ముగిసిందన్నారు. అయితే ఆయన మద్దతుదారులు తప్పకుండా రిపబ్లికన్‌ పార్టీకి రావాలని ట్రంప్​ ట్వీట్‌ చేశారు.

ట్రంప్‌ ట్వీట్‌కు ధీటుగా స్పందించారు జో బిడెన్‌. కలిసి కట్టుగా ట్రంప్‌ను ఓడిద్దామని, బెర్నీ మద్దతుదారులు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు​.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 83వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.