ETV Bharat / international

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు! - రోబో

మానవులకు మాత్రమే సాధ్యమనుకున్న చిత్రలేఖన కళను అద్భుతంగా ప్రదర్శిస్తోంది ఓ రోబో. ఈ మరమనిషి తొలిసారి గీసిన చిత్రాలు ఏకంగా రూ.8కోట్లకు అమ్మడవటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!
author img

By

Published : Jun 30, 2019, 5:22 AM IST

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!

రోబోలు చాలా రకాల పనులు చేయడం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ మానవులకు మాత్రమే సాధ్యమైన అద్భుతమైన చిత్ర కళను ప్రదర్శిస్తోంది ఓ మర మనిషి. ఈ రోబో చిత్రలేఖనం నైపుణ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

19 వ శతాబ్దం నాటి తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అడా లవలేస్ పేరును సార్థకం చేసేలా ఈ రోబోను ఐడాగా పిలుస్తున్నారు. ఈ మర మనిషి గీసిన చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఐడా చిత్రాలకు వచ్చిన డబ్బెంతో తెలుసా అక్షరాలా 1.27 మిలియన్ అమెరికన్ డాలర్లు... భారత కరెన్సీలో రూ. 8 కోట్లు. ఈ ప్రదర్శన జులై 6 వరకు కొనసాగనుంది.

ఐడాను కృత్రిమ మేధస్సు గల తొలి అల్ట్రా రియాలిస్టిక్ రోబోగా చెప్తున్నారు.

"ఐడా మనిషిని చూడగలదు. కళ్లల్లోని కెమెరాలతో మనిషి చిత్రాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. సాంకేతికత సహాయంతో చిత్రాన్ని విశ్లేషించుకుంటుంది. అనంతరం బొమ్మలను గీస్తుంది."

-ఐడెన్ మెల్లర్, చిత్ర ప్రదర్శన నిర్వాహకుడు

తన ముందు నిల్చున్న వారి చిత్రాలను ఆల్గారిథమ్స్ సహాయంతో విశ్లేషించి గీయడమే కాదండోయ్... ఇంజినీర్లూ నిక్షిప్తం చేసిన బొమ్మలనూ చక్కగా గీస్తోంది.
ఐడా చేతికున్న పెన్సిల్ 5వందల ఏళ్ల నాటి కలపలోనిది. ఈ కలపను ఉపయోగించి తయారుచేసిన పెన్సిల్​నే ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఉపయోగించేవారు.

ఈ రోబోను ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు రూపొందించారు.

ఇదీ చూడండి: సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Osaka - 29 June 2019
1. French President Emmanuel Macron and Chinese President Xi Jinping shaking hands, then taking seats
2. Close of Macron
3. Close of Xi, pan to Macron
4. Wide of the meeting
STORYLINE:
French President Emmanuel Macron met with Chinese President Xi Jinping on the sidelines of the G20 summit in Osaka on Saturday.
Xi asked his French counterpart to work together to defend multilateralism for stable development in the world.
According to Chinese media, the two leaders also discussed matters on the Korean Peninsula and the Iran nuclear deal.
The two leaders met in March earlier this year when Xi went on his European tour.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.