ETV Bharat / international

తుదిశ్వాస విడిచిన ట్రంప్​ సోదరుడు రాబర్ట్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సోదరుడు రాబర్ట్ ట్రంప్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన రాబర్ట్​.. న్యూయార్క్​లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్​ వెల్లడించారు.

Robert Trump, the president's younger brother, dead at 71
తుది శ్వాస విడిచిన ట్రంప్​ సోదరుడు రాబర్ట్
author img

By

Published : Aug 16, 2020, 10:09 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ సోదరుడు రాబర్ట్​ ట్రంప్ (72) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల నుంచి​ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవల న్యూయార్క్​లోని ఓ ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి తన సోదరుడు మృతి చెందినట్లు ట్రంప్​ స్వయంగా ప్రకటించారు.

"నా సోదరుడు రాబర్ట్ తుది శ్వాస విడిచాడని చెప్పడానికి ఎంతో బాధగా ఉంది. రాబర్ట్​ నా సోదరుడు మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. మమ్మల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పటికీ.. నా సోదరుడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి. రాబర్ట్​ అంటే నాకు చాలా ఇష్టం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా."

-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.

తీవ్ర అస్వస్థతకు గురైన రాబర్ట్​ను కొన్నిరోజులు నుంచి ఇంటెన్సివ్ కేర్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారమే తన తమ్ముడిని చూసేందుకు న్యూయార్క్​కు వెళ్లారు.

ఫైనాన్స్​ర్​ గా ప్రస్థానం...

డొనాల్డ్ ట్రంప్​తో కలిసి రాబర్ట్​ ట్రంప్​ కూడా కుటుంబ వ్యాపారాలైన రియల్​ఎస్టేట్​ విభాగంలో పని చేశారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్​నకు అత్యంత ఆత్మీయుల్లో రాబర్ట్​ కూడా ఒకరు. మొదట వాల్​స్ట్రీట్‌లో ఉన్న ఓ కార్పొరేట్ ఫైనాన్స్‌లో పనిచేసేవారు. కొంత కాలం తర్వాత కుటుంబ వ్యాపారంలోకి అడగుపెట్టారు. ట్రంప్ సంస్థలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్‌ను నిర్వహించారు.

ఇదీ చూడండి టైమ్స్ ‌స్క్వేర్‌లో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.