ETV Bharat / international

'ట్రంప్​ చేసింది మార్చాలంటే నెలలు గడిచిపోతాయి'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. వలసవాదులపై చేపట్టిన చర్యలను మార్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందన్నారు జో బైడెన్​. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే సమస్య ఇంకా ముదురుతుందని అభిప్రాయపడ్డారు.

Reversing Trump immigration policies will take months says Joe Biden
ట్రంప్​ చర్యల్లో మార్పులు తేవడంలో జాప్యం!
author img

By

Published : Dec 23, 2020, 9:15 AM IST

వలసవాదులపై ట్రంప్​ తీసుకున్న చర్యలను తిరిగి మార్చేందుకు కొన్ని నెలల సమయం పడుతుందని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో.. త్వరితగతిన ట్రంప్​ చర్యలను రూపుమాపుతానని బైడెన్​ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ వ్యవహారంపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. సరిహద్దుల్లో కొత్త సమస్యలు తలెత్తుతాయని జో బైడెన్​ పేర్కొన్నారు. ఈ విషయంపై మెక్సికో అధ్యక్షుడితో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్న బైడెన్​.. తన చర్యలు సమస్యలను పరిష్కరించే విధంగానే ఉంటాయని.. వాటిని ఇంకా దారుణంగా మార్చనని పేర్కొన్నారు.

బైడెన్​ ప్రధాన సలహాదారులు... సుసాన్ రైస్, జాక్​ సలివన్​ కూడా వలసవాదుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావని ఇటీవలే అభిప్రాయపడ్డారు.

'ఇది తొలి అడుగు మాత్రమే'

కాంగ్రెస్​ ఆమోదించిన భారీ ఉద్దీపన ప్యాకేజీపై మాట్లాడిన బైడెన్​... కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇది మొదటి అడుగు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఉంటాయని సంకేతాలిచ్చారు. కొవిడ్​ వ్యాక్సిన్​ అందరికీ అందించేందుకు, పాఠశాలలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:కుప్పకూలిన ప్రభుత్వం- ఆ దేశంలో మళ్లీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.