ETV Bharat / international

అమెరికా కోర్టుల్లో ట్రంప్​కు తప్పని భంగపాటు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకవతకలు జరిగాయని కోర్టులను ఆశ్రయిస్తున్న డొనాల్డ్​ ట్రంప్​కు భంగపాటు తప్పడం లేదు. ఓట్ల లెక్కింపులో మోసం జరిగిందని ఆయన ప్రచారం బృందం పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనాలో దాఖలు చేసిన పిటిషన్లను ఆయా న్యాయస్థానాలు కొట్టిపారేశాయి. అమెరికా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్రంప్​కు మద్దతుగా ఉన్న న్యాయసంస్థ వెనక్కి తగ్గింది. పెన్సిల్వేనియాలో దాఖలు చేసిన వ్యాజ్వాన్ని ఉపసంహరించుకుంది.

Republicans face court setbacks, Trump law firm steps down
అమెరికా కోర్టులలో ట్రంప్​కు తప్పని భంగపాటు
author img

By

Published : Nov 14, 2020, 9:55 AM IST

'కింద పడ్డా నాదే పై చేయి' అనే నానుడికి అతికినట్టు సరిపోతారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైనా.. ఆయన దానిని ఇంకా అంగీకరించడం లేదు. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కోర్టులకు వెళ్లినా ఆయనకు భంగపాటు తప్పడం లేదు. తాజాగా పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా కోర్టులలో ట్రంప్ ప్రచార బృందం దాఖలు చేసిన వ్యాజ్యాలు తిరస్కరణకు గురయ్యాయి. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని న్యాయస్థానాలు వాటిని కొట్టి పారేశాయి.

పెన్సిల్వేనియా..

పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు వచ్చిన 9,300 మెయిల్ ఇన్​ బ్యాలెట్లను లెక్కించవద్దని ట్రంప్ ప్రచార బృందం దాఖలు చేసిన పిటిషన్​ను ఫెడరల్ అప్పీల్ కోర్టు తిరస్కరించింది. కొవిడ్​ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మూడు రోజులు అదనంగా గడువు ఇవ్వడం సమర్థనీయమని స్పష్టం చేసింది. చట్టబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరి ఓటును లెక్కించడం ముఖ్యమని పేర్కొంది.

కరోనా నేపథ్యంలో పెన్సిల్వేనియాలో ప్రజలు నవంబరు 6వరకు మెయిల్ ఇన్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ రాష్ట్రంలో మొత్తం 68 లక్షల ఓట్లు పోలవ్వగా.. జో బైడెన్​ 60వేల ఆధిక్యంతో గెలిచారు.

ఎన్నికల్లో కీలకమైన ఈ రాష్ట్రంలోని 20 ఎలక్టోరల్ ఓట్లను గెలిచేందుకు శథవిధాలా ప్రయత్నిస్తున్నారు ట్రంప్. న్యాయస్థానంలో మొత్తం 15 పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఒక్క ఆధారం చూపలేకపోయారు.

మిషిగన్​లో..

మిషిగన్​లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని ట్రంప్​ బృందం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. బ్యాలెట్ల నిర్వహణలో మోసం జరిగందనే ఆరోపణలను తోసిపుచ్చింది.

అరిజోనాలో మెట్రో పియోనిక్స్​లో బ్యాలెట్లను పునర్​పరిశీలించాలని ట్రంప్ ప్రచారం బృందం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా న్యాయస్థానం తిరస్కరించింది.

వెనక్కి తగ్గిన న్యాయసంస్థ

ట్రంప్ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న అమెరికా దిగ్గజ న్యాయసంస్థ రైట్ మారిస్​ అండ్ ఆర్థుర్​పై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పెన్సిల్వేనియా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను ఆ సంస్థ ఉపసంహరించుకుంది. ట్రంప్​ కోసం కోర్టులో న్యాయపోరాటం చేసేందుకు ఆయన ప్రచార బృందం నుంచి రైట్ మారిస్​ అండ్ ఆర్థుర్​ 7లక్షల డాలర్లు అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.