ETV Bharat / international

ఎన్నికల్లో​ సరికొత్త వ్యూహం.. 'మెయిల్ ఇన్​' బాక్స్​లు మాయం!

ప్రపంచమంతటా ఆసక్తి రేకెత్తించే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అగ్రరాజ్యాధినేత ఎవరో నిర్ణయించే ఎన్నికలు నవంబరు 3న జరగనున్నాయి. ఇందులో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే కరోనా కారణంగా ఓటింగ్​లో కీలకంగా ఉన్న 'మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌' మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాన్ని నమ్మలేమని ట్రంప్​ అంటున్నారు. కానీ డెమొక్రాట్లు మాత్రం మెయిల్​ ఇన్​ ఓటింగ్​ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు.

Report: Post Office warns 46 states about mail voting delays
ట్రంప్​ సరికొత్త వ్యూహం.. 'మెయిల్ ఇన్​' బాక్స్​లు మాయం!
author img

By

Published : Aug 16, 2020, 3:13 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కొనసాగుతోంది. భారతీయ అమెరికన్లను మచ్చిక చేసుకునేందుకు ట్రంప్​ కొత్త ప్రచారాలను మొదలుపెడితే... బైడెన్​ ఒక అడుగు ముందుకేసి ఏకంగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్​ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ఇలాంటి హోరాహోరీ సమయంలో 'మెయిల్‌-ఇన్‌ ఓటింగ్'‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పద్ధతి అనుసరిస్తే అవినీతి జరుగుతుందని.. అది తనకు ముప్పు తెస్తుందని భావిస్తున్నారు ట్రంప్​. అందుకే ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు తగిన కీలక నిర్ణయాలను తెరవెనుక నుంచే తీసుకుంటున్నారు.

mail voting delays
మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్ల సేకరణ

ఎప్పట్నుంచో ప్రయత్నాలు..

అమెరికా పోస్టల్ సర్వీస్​కు ఫెడరల్ ప్రభుత్వ నిధులు నిలిపివేసేందుకు ట్రంప్ గతంలోనే ప్రణాళికలు మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పోస్టల్ ఏజెన్సీలు.. నిధుల కొరతతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో వారి నుంచి కీలక ప్రకటన వెలువడింది. అది కాస్తా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

లెక్కింపు నాటికి అందించలేం...

కరోనా నేపథ్యంలో పోస్టల్​ బ్యాలెట్​లను సేకరించడం, సకాలంలో డెలివరీ చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది యూఎస్​ పోస్టల్​ సర్వీస్​. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలకు ఓ లేఖ ద్వారా వెల్లడించారు పోస్ట్​ మాస్టర్​ జనరల్​ లూయిస్​ డెజోయ్. నవంబర్​లో ఓట్ల లెక్కింపు సమయానికి మెయిల్​ ఇన్​ బ్యాలెట్లు చేరుకోకపోవచ్చని స్పష్టం చేశారు. ఫలితంగా లక్షల మందికిపైగా ఓట్ల ప్రయోజనం లేకుండాపోతాయని అభిప్రాయపడ్డారు.

mail voting delays
మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్ల సేకరణ

"పోస్టాఫీసు ద్వారా మెయిల్ ఎలా పనిచేస్తుందో వాస్తవికంగా పరిశీలించాలి. డెలివరీ ప్రమాణాలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను, ఓటర్లను కోరుతున్నాం. ఓటర్లు మెయిల్ ద్వారా బ్యాలెట్లను వేయడానికి తగిన సమయం అవసరం" అని డెజోయ్ చెప్పుకొచ్చారు. ఈయనను ఇటీవలే ట్రంప్​ నియమించడం గమనార్హం.

బాక్స్​లు మాయం...

ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో మెయిల్​ కలెక్షన్​ బాక్స్​లు తొలగిస్తున్నారని కొంతమంది ఓటర్లు, న్యాయవాదులు ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రంప్​ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో.. కరోనా పేరిట మెయిల్​ ఇన్​ బాక్స్​లను తొలగిస్తుండటం కలవరపెడుతోంది. దీని వల్ల వేలాది మంది ఓటింగ్​కు దూరమయ్యే అవకాశముందని ఇప్పటికే రాష్ట్రాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే కారణమా...?

"మెయిల్‌-ఇన్‌ ఓటింగ్‌ చేపడితే 2020 ఎన్నికలు తప్పుడు, మోసపూరిత ఎన్నికలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కరోనా నుంచి కోలుకుని ప్రజలు సరిగ్గా, క్షేమంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకు ఎన్నికలను వాయిదా వేయాలి" అని ఈ విధానంపై గతంలోనే వివాదం రాజేశారు ట్రంప్​. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పటికే వచ్చిన పలు ముందస్తు పోల్స్​ ఆధారంగా చూస్తే ఈసారి ట్రంప్​నకు ఓటమి ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే గట్టి పోటీనిస్తున్ బైడెన్​ దూకుడు తగ్గించేందుకు ఇలా అధికార యంత్రాగంతోనే వివాదాన్ని ట్రంప్ తెరపైకి​ తెచ్చినట్టు తెలుస్తోంది.

ప్రత్యర్థి వాదన ఇదీ..

అమెరికా స్థానిక ఎన్నికల్లో మెయిల్​ ఇన్​ ఓటింగ్ మోసాలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ రాష్ట్ర, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరిగే ఎన్నికల్లో మాత్రం ఇలాంటి దాఖలాలు లేవు. మార్చిలో ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ సైతం మెయిల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న విషయాన్ని బైడెన్ గతంలోనే ప్రస్తావించారు. అప్పుడు తప్పుగా అనిపించని ఈ విధానం.. ఇప్పుడెందుకు వద్దంటున్నారు అనేది బైడెన్​ వాదన.

కత్తిరింపులు...

బ్యాలెట్ ఓటింగ్​ను సజావుగా నిర్వహించేందుకు రిపబ్లికన్లు దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను కుదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గుర్తింపు పత్రాలను చూపించాలని కొంతమంది ఓటర్లకు కఠినమైన నియమాలు విధించారని.. మరికొందరిని సాక్షులను తీసుకురావాలని కోరుతున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. మోసాలు నివారించేందుకే ఇలా చేస్తున్నామని రిపబ్లికన్లు చెబుతుండగా... డెమొక్రాట్లు మాత్రం ఇవన్నీ ఓటర్ల హక్కులను అణచివేయడానికి జరుగుతున్న కుట్ర అని విమర్శిస్తున్నారు.

సరికొత్త నిర్ణయాలు కూడా...

మెయిల్‌ను సకాలంలో డెలివరీ చేయవలసిన అవసరం పెరుగుతున్న తరుణంలో.. ఖర్చు తగ్గించుకోవాలని సేవలను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు పోస్ట్​ మాస్టర్​ జనరల్​ లూయిస్​ డెజోయ్. అంతేకాకుండా పంపిణీ కేంద్రాలు ఆలస్యంగా నడుస్తుంటే ఓవర్ టైం చెల్లింపులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. వాటి నుంచి వచ్చే మెయిళ్లను ఆపేస్తున్నారు. ఈ తాజా నిర్ణయాలను ఆయా రాష్ట్రాలకు పంపిన లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రాలు విధించే డెడ్​లైన్​ ఆధారంగా చూస్తే అనుకున్న సమయానికి మెయిళ్లను అందిచలేకపోవచ్చని పోస్టల్​ అధికారులు భావిస్తున్నారు.

అధికారుల కారణాలు వేరు..

ఒరేగాన్​, మోన్టానా, ఇండియానా ప్రాంతాల్లో మెయిల్​ బాక్స్​లు తొలగించడం వివాదాస్పదమైంది. అయితే మోన్టానాలో కాంగ్రెస్​ సభ్యుల జోక్యంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నారు. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం తొలగింపు ప్రక్రియను నిలిపివేసినట్లు అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఒక్క మోన్టానాలోనే జూలై నుంచి ఇప్పటివరకు 25 బాక్స్​లు తొలగించారాని.. మరో 30 తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే తక్కువ వాడకం కారణంగా వాటిని తొలగిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కరోనా వచ్చాక మెయిల్​ వాడకం మరింత తగ్గిందని పేర్కొన్నారు. ఒక ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ బాక్స్​లు ఉంటే వాటిని తీసేస్తున్నట్లు పోస్టల్​ అధికారులు స్ఫష్టం చేశారు.

ఇరు వర్గాల వాదనలు ఇలా...

బాక్స్​ల తొలగింపు నిర్ణయంపై డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఓటర్లను అణచివేయాలని ట్రంప్​ సర్కార్​ చూస్తున్నట్టు మండిపడ్డారు డెమోక్రటిక్​ వర్జీనియా గవర్నర్​ రాల్ఫ్​ నార్తమ్​. కచ్చితంగా వర్జీనియా ప్రజలు బ్యాలెట్​ బాక్స్​ సేవలు పొందేలా చర్చలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే రిపబ్లికన్ల వాదన వేరేలా ఉంది. దేశవ్యాప్తంగా ఇంత స్థాయిలో పోస్టల్​ బ్యాలెట్​ వినియోగించే అవసరం రాలేదని ఒక్కసారిగా మిలియన్ల ప్రజలు ఆయా సేవలు వినియోగిస్తే.. అది యూఎస్​ పోస్టల్​ సర్వీస్​కు పెద్ద భారమని పేర్కొంటున్నారు. ఇందులో ట్రంప్​ సర్కార్​ కుట్ర లేదని స్పష్టం చేశారు.

ఏది ఏమైనా ఈ ఏడాది ఎన్నికల్లో పోస్టల్​ బ్యాలెట్​ కింగ్​మేకర్​గా మారనుంది. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్తుందో? ఈ ఓటింగ్​తో ఫలితాలు ఎలా వస్తాయో? వేచి చూడాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.