ETV Bharat / international

కరోనా కుటుంబం నుంచి మరో వైరస్- ఇదీ చైనా నుంచే! - recent update on corona virus family

మానవాళిపై మరో వైరస్​ దాడి చేసే ప్రమాదం ఉందా? కరోనా వైరస్​ స్థాయిలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను, మానవ ఆరోగ్యాలను నాశనం చేయడానికి ఇంకో క్రిమి సిద్ధంగా ఉందా ? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వైరస్​ రకానికి చెందిన కొత్త వైరస్​ను తాజాగా పరిశోధకులు గుర్తించారు.

virus from corona family
కరోనా కుటుంబం నుంచి మరో వైరస్
author img

By

Published : Oct 15, 2020, 12:30 PM IST

Updated : Oct 15, 2020, 12:55 PM IST

కరోనా కుటుంబానికి చెందిన మరో వైరస్​ మానవాళిని మరోమారు ఇబ్బంది పెట్టనున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. ఇది ప్రధానంగా పందుల నుంచి వ్యాపించే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ వైరస్​ మూలాలు చైనాలో ఉన్నట్లు వెల్లడించారు. పంది పిల్లల్లో తీవ్ర విరేచనాలు కలిగించే ఈ వైరస్​.. మానవులకు సంక్రమించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాన్ని తొలిసారి 2016లో చైనాలో కనుగొన్నారు. ఇది కూడా కరోనా వైరస్​ కుటుంబానికి చెందినదే. సాడ్స్​-కోవ్​ అని పిలుస్తారు.

ఈ వైరస్​ గబ్బిలాల నుంచి చైనాలో పందులకు వ్యాపించింది. ముఖ్యంగా పంది పిల్లలకు విరేచనాలు కలిగించి వాటి మరణాలకు ఈ వైరస్​ కారణమవుతోంది. దీని వ్యాప్తి అక్కిడితో ఆగిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. మానవుని కాలేయం, పేగులు, జీర్ణకోశం పైనా ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. ఈ విషయం ప్రయోగశాలల్లో జరిపిన తాజా ప్రయోగాల్లో వెల్లడైందని తెలిపారు. అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా పందుల పెంపకం ప్రధానంగా ఉండే దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ కొత్త వైరస్​ కారణంగా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్​ నార్త్​ కరోలినా పరిశోధకులు చెబుతున్నారు. వీరి అధ్యయనాన్ని పీఎన్​ఏఎస్​ జర్నల్​ ప్రచురించింది.

ఇదీ చూడండి: కరోనా విలయం- 'మహా'లో మరో 10వేల కేసులు

Last Updated : Oct 15, 2020, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.