ETV Bharat / international

ర్యాపిడ్​ టెస్ట్​కు అమెరికా ఓకే- మార్గదర్శకాలపై రగడ!

తొలి ర్యాపిడ్ టెస్ట్​కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థ ఆమోదం తెలిపింది. 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకునేలా అబాట్ లేబరేటరీస్ తయారు చేసిన ఈ పరీక్ష విధానానికి అనుమతులు ఇచ్చింది. అయితే ఇందులో నెగెటివ్ వస్తే ల్యాబ్​ల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు కొవిడ్‌ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను సీడీసీ సవరించింది. ఈ నిర్ణయంతో నిపుణుల్లో ఆందోళన మొదలైంది.

Rapid USD 5 coronavirus test doesn't need specialty equipment
ర్యాపిడ్​ టెస్ట్​కు అమెరికా ఓకే- మార్గదర్శకాలపై రచ్చ!
author img

By

Published : Aug 27, 2020, 5:21 PM IST

అమెరికాలో తొలి ర్యాపిడ్ టెస్టుకు ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ) ఆమోదం తెలిపింది. అబాట్ లేబరేటరీస్ తయారు చేసిన ఈ కిట్ ద్వారా 15 నిమిషాల్లోనే కరోనా ఫలితం తెలుసుకోవచ్చు. ఇది 5 డాలర్లకే అందుబాటులో ఉండనుంది. దీనికోసం ఎలాంటి కంప్యూటర్ వ్యవస్థ అవసరం లేదు. ఫ్లూ, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను పరీక్షించేందుకు ఉపయోగించే సాంకేతికతనే ఈ ర్యాపిడ్ టెస్టుల కోసం వినియోగించారు. చాలా తక్కువ ధరలోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చు.

ముక్కులోని నమూనాలను ఉపయోగించి ఈ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తారు. అయితే ల్యాబ్​లో నిర్వహించే పరీక్షలతో పోలిస్తే వీటి కచ్చితత్వం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ర్యాపిడ్ టెస్ట్​లో నెగెటివ్ వచ్చినవారు ల్యాబ్ టెస్టులు నిర్వహించుకోవాలని ఎఫ్​డీఏ సూచించింది.

లాలాజలంతో నిర్వహించే కరోనా పరీక్ష కోసం ఇటీవలే యేల్ విశ్వవిద్యాలయానికి అనుమతులు మంజూరు చేసింది. దీనికి ముక్కులోని నమూనాలు అవసరం లేదు. అయితే అత్యాధునిక ల్యాబుల్లోనే ఈ పరీక్షలు నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.

మార్గదర్శకాలు సవరణ

మరోవైపు, కొవిడ్‌ టెస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను అమెరికా మరోసారి సవరించింది. కరోనా వైరస్‌ సోకిన వారితో సన్నిహితంగా మెలిగినప్పటికీ లక్షణాలు లేకుంటే కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకోవడం అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, కరోనా సోకిన వ్యక్తులకు ఆరడుగులలోపు 15నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నట్లయితేనే కొవిడ్‌ టెస్ట్‌కు వెళ్లాలని సూచించింది. అంతేకాకుండా నెగటివ్‌ రిపోర్టు వచ్చినంత మాత్రాన వైరస్‌ సోకలేదనుకోవడంగా భావించవద్దని, తర్వాతి కాలంలో వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వెల్లడించింది. అందుకే, లక్షణాలు కనిపించిన వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కొవిడ్‌ నిర్ధరణ పరీక్ష చేయించుకోనట్లుయితే పదిరోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే, కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారు లక్షణాలు లేకున్నా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని గతంలో సీడీసీ ప్రకటించింది. అంతేకాకుండా కరోనా సోకిన వారితో కలిసినట్లు అనుమానం ఉన్నా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. లక్షణాలు లేనివారు కూడా వైరస్‌వ్యాప్తికి కారణమవుతారని నివేదికలు స్పష్టం చేస్తున్నట్లు సీడీసీ అభిప్రాయపడింది. ఈ పరీక్షల ద్వారా కరోనా వైరస్‌ను వీలైనంత త్వరగా గుర్తించి వ్యాప్తిని అడ్డుకోవచ్చని తెలిపింది. అయితే, తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల్లో మాత్రం లక్షణాలు లేనివారు కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోనవసరం లేదని చెప్పడం గమనార్హం.

ఫౌచీ ఆందోళన

అయితే కొవిడ్‌ టెస్టులపై ఉన్న మర్గదర్శకాలను సీడీసీ సవరించడం తాజా చర్చకు దారితీసింది. అమెరికాలో వైరస్‌ కట్టడిలో విఫలమైన ట్రంప్‌ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలతో టెస్టుల సంఖ్యను మరింత తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు మొదలయ్యాయి. సీడీసీ తాజా నిర్ణయంతో నిపుణుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది.

ఈ విషయంపై వైట్‌హౌజ్‌ కరోనా వైరస్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ ఆంథోని ఫౌచీ కూడా స్పందించారు. కొవిడ్‌ టెస్టింగ్‌ సిఫార్సులపై ఈ మధ్య జరిగిన టాస్క్‌ఫోర్స్‌ మీటింగ్‌కు నేను హాజరుకాలేదని ఆంథోని ఫౌచీ పేర్కొన్నారు. సీడీసీ సవరించి విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రజల్లో తప్పుడు భావవను కలిగిస్తాయని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. లక్షణాలు కనిపించని వారితో ప్రమాదంలేదనే భావన కలగడం ఆందోళన కలిగించే విషయమని ఫౌచీ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటికే దాదాపు ఏడు కోట్ల మందికి కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఇక అమెరికాలో ఇప్పటి వరకు 58లక్షల మందిలో వైరస్‌ బయటపడగా లక్షా 79వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి- 'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.