ETV Bharat / international

శ్వేతసౌధానికి చేరాలంటే జాతి విద్వేషాన్ని దాటాల్సిందే!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతి విద్వేష అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీ అయిన డెమొక్రటిక్ నేతలు ఈ అంశంపైనే.. ట్రంప్ సర్కార్​ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరి అమెరికా ఎన్నికల్లో 'జాతి విద్వేషం' ఏ విధంగా ప్రభావం చూపనుంది? శ్వేతసౌధంలో అడుగుపెట్టేది ఎవరో నిర్ణయించేది ఈ అంశమేనా?

Racism key in race to White House?
ఈటీవీ భారత్ ప్రతినిధితో ప్రత్యేక చర్చ
author img

By

Published : Aug 27, 2020, 5:47 AM IST

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హోరు ఊపందుకుంది. హడావుడి సమవేశాలతో ప్రచారాలు వాడీవేడీగా సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్, జాతి విద్వేషంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జాతి విద్వేషం లేదంటూ వివరించారు. తనతో పాటు డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​ సైతం అమెరికాకు వలస వచ్చిన భారతీయులకు జన్మించినట్లు చెప్పుకొచ్చారు.

అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం.. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగంపై విరుచుకుపడుతూ వస్తోంది. మరి అమెరికాలో జాత్యహంకారం ఉందా? 2020 ఎన్నికలను నడిపించే ప్రధానాంశం అదేనా? ఈ విషయంపై అమెరికాకు చెందిన ప్రముఖులు 'ఈటీవీ భారత్​'తో చర్చించారు. వారి అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈటీవీ భారత్ ప్రతినిధితో ప్రత్యేక చర్చ

ఎప్పటినుంచో...

అమెరికాలో జాతి విద్వేషం ఎప్పటినుంచో ఉందని సోషియాలజీ ప్రొఫెసర్, విద్వేష నేరాల పరిశోధకులు డాక్టర్ రండల్ బ్లెజక్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఈ విషయాన్ని దేశమంతా గ్రహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం జాత్యహంకారంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోందని చెప్పారు. శ్వేత జాతీయులు దీన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఆలోచిస్తున్నారని వెల్లడించారు.

అంతర్భాగమే!

జాత్యంహంకార సమస్యలు, నల్లజాతీయులను హత్యచేయడం అమెరికా రాజకీయాల్లో, ప్రచారాల్లో భాగమైపోయాయని మత స్వేచ్ఛ సంస్థ సీనియర్ పరిశోధకురాలు ఫరాహ్నాజ్​ ఇస్పాహనీ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లోనూ వీటి ప్రస్తావన ఉందన్నారు. కానీ ఈసారి జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరుతోందన్నారు. అమెరికాలో జాతి గురించి మాట్లాడకుండా ఉన్న రోజులు లేవంటూ పేర్కొన్నారు. అయితే వీటి గురించి అంత తీవ్రంగా చర్చ జరిగేది కాదని చెప్పారు. తొలిసారి అమెరికాలోని ప్రధాన రాజకీయ పార్టీ(డెమొక్రటిక్) దీని గురించి మాట్లాడుతోందని వివరించారు.

ఇదీ చదవండి- ప్రియాంకను తనతో పాటు రమ్మన్న మదర్ థెరిసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.