క్వాడ్ దేశాధినేతలతో కూడిన తొలి శిఖరాగ్ర సమావేశం చాలా బాగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కూటమిని ఇష్టపడుతున్నట్లు అనిపించిందని అన్నారు. ఈ భేటీ పూర్తయిన తర్వాత క్వాడ్ సమావేశం గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లతో కూడిన ఈ క్వాడ్ కూటమి సదస్సు శుక్రవారం జరిగింది. 2007లో ఈ కూటమి ఏర్పాటు కాగా.. తొలిసారి దేశాధినేతల స్థాయిలో చర్చలు జరిగాయి.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, సమానత్వం కాపాడేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో నేతలంతా ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై అందరికీ హక్కుందని ఉద్ఘాటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేందుకు చైనా రకరకాల యత్నాలు, దుందుడుకు వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది.
ఇవీ చదవండి: