ETV Bharat / international

చైనా లక్ష్యంగా క్వాడ్ దేశాధినేతల వ్యాసం! - క్వాడ్ వాషింగ్టన్ పోస్ట్

క్వాడ్ దేశాధినేతలు సంయుక్తంగా వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వ్యాసం రాశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని అందులో స్పష్టం చేశారు. క్వాడ్ దేశాల మధ్య సహకారం సంక్షోభ సమయంలో ఏర్పడిందని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. పారిస్ ఒప్పందం అమలు సహా, కరోనాపై పోరులో సహకరించుకుంటామని ఉద్ఘాటించారు.

Quad leaders
క్వాడ్
author img

By

Published : Mar 14, 2021, 1:53 PM IST

ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అందరికీ అందుబాటులో ఉంచేందుకు కట్టుబడి ఉంటామని క్వాడ్ దేశాధినేతలు మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనల ప్రకారం ఆ ప్రాంతంలో స్వేచ్ఛా రవాణా ఉండేలా చూస్తామని పునరుద్ఘాటించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

ఇండో పసిఫిక్​లో ప్రాంతంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాకు ఈమేరకు పరోక్ష సందేశమిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని యొషిహిదె సుగా, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కలిసి.. వాషింగ్టన్ పోస్ట్ పత్రికలో వ్యాసం రాశారు. అన్ని దేశాలు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోగలగాలని పేర్కొన్నారు. నాలుగు దేశాల ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా కలిసి పనిచేశాయని, తొలిసారి జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిపాయని చెప్పారు.

సంక్షోభం నుంచి...

క్వాడ్ దేశాల మధ్య సహకారం.. సంక్షోభ సమయంలో ఏర్పడిందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. 2004లో ఇండోనేసియాలో సంభవించిన తుపాను ప్రమాదాన్ని నేతలు ప్రస్తావించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం.. సహాయం కోసం అర్థించినప్పుడు ఈ నాలుగు దేశాలు స్పందించాయని చెప్పారు. ఆచరణాత్మక సహకారం, మానవతా సహాయం కోసం ఈ దేశాలు పాటుపడ్డాయని వివరించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం సహా ఈ ప్రాంతానికి అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఇండోనేసియా సునామీ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో ప్రమాదకరమైన మార్పులు వచ్చాయని క్వాడ్ దేశాధినేతలు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారాయని చెప్పారు. వాతావరణ మార్పులను అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యగా అభివర్ణించారు. పారిస్ ఒప్పందాన్ని అమలు చేసేందుకు కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

భారత్​లో టీకాలు

కరోనా పోరులో నాలుగు దేశాల సహకారాన్ని స్వాగతించారు క్వాడ్ దేశాధినేతలు. కొవిడ్​ను అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. సురక్షితమైన, సమర్థమైన టీకాలను భారత్​లో తయారు చేయాలని, ఉత్పత్తి సామర్థ్యాలు పెంచాలని సంకల్పించినట్లు వివరించారు. 2022 నాటికల్లా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు టీకాలు అందించేందుకు ప్రతి దశలో భాగస్వామ్యంతో పనిచేస్తామన్నారు.

ఇదీ చదవండి:

  1. 'ఇండో-పసిఫిక్​లో శాంతి, సుస్థిరతకు క్వాడ్ కీలక పాత్ర'
  2. 'క్వాడ్​ దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్​ సిద్ధం'
  3. చైనా కట్టడికి చతుర్ముఖ వ్యూహం!
  4. టీకా కోసం భారత్​లో 'క్వాడ్' పెట్టుబడులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.