ETV Bharat / international

ఇద్దరు భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం - 2020 Great Immigrants

ప్రముఖ భారతీయ అమెరికన్లు సిద్ధార్థ ముఖర్జీ, రాజ్​ చెట్టిలకు... '2020 గ్రేట్​ ఇమ్మిగ్రెంట్స్' గౌరవం దక్కింది. అమెరికాలో కరోనా సంక్షోభ నివారణ చర్యలకు వీరు ఎనలేని కృషి చేశారని కార్నెగీ కార్పొరేషన్ తెలిపింది.

Siddhartha Mukherjee, Prof Raj Chetty
సిద్ధార్థ ముఖర్జీ, రాజ్​ చెట్టిలకు గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ గౌరవం
author img

By

Published : Jul 2, 2020, 11:35 AM IST

కరోనా సంక్షోభ నివారణకు సహకరించిన ఇద్దరు ప్రముఖ భారతీయ అమెరికన్లకు '2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్' గౌరవం దక్కింది. అమెరికా స్వాతంత్ర్య వేడుకలకు ముందు ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫౌండేషన్​ ప్రకటించిన ఈ గౌరవ పురస్కారం పొందిన 38 మంది వలసదారుల్లో వీరూ ఉండడం విశేషం.

పులిట్జర్ బహుమతి గ్రహీత, ప్రముఖ్ అంకాలజిస్ట్ సిద్ధార్థ ముఖర్జీ, హార్వర్డ్ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్​ రాజ్​ చెట్టిని... '2020 గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్' పురస్కారంతో గౌరవిస్తున్నట్లు కార్నెగీ కార్పొరేషన్ ఆఫ్ న్యూయార్క్​ తెలిపింది.

సిద్ధార్థ ముఖర్జీ: దిల్లీలో జన్మించిన సిద్ధార్థ్ ముఖర్జీ జీవశాస్త్రవేత్తగా, అంకాలజిస్టుగా ప్రసిద్ధులు. ఆయన రాసిన 'ది ఎంపరర్​ ఆఫ్ ఆల్​ మలాడీస్​: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్'​కు పులిట్జర్ బహుమతి వరించింది.

ఆయన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ వైద్యునిగానూ సేవలందించారు. ఆయనకు 2014లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ లభించింది.

ఎనలేని కృషి..

"కొవిడ్ సంక్షోభ సమయంలో ముఖర్జీ తన వ్యాసాలు, మీడియా ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఫోరమ్​లు, తన సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వైరస్​ గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు."

- కార్నెగీ కార్పొరేషన్​

కరోనా నుంచి రక్షణ పొందాలంటే కచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, (సెల్ఫ్ ఐసోలేషన్)​ స్వీయ నిర్బంధంలో ఉండాలని ముఖర్జీ ... ప్రజల్లో అవగాహన కల్పించారు.

రాజ్​ చెట్టి: దిల్లీలో జన్మించిన రాజ్​ చెట్టి అతి పిన్న వయస్సులోనే ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసిన వారిలో ఒకరిగా నిలిచారు.

"రాజ్​ చెట్టి ఆర్థిక, సామాజిక చైతన్యానికి గల అడ్డంకులను గుర్తించడం సహా, వాటిని అధిగమించేందుకు నిర్దేశిత విధాన పరిష్కారాలను అభివృద్ధి చేశారు.

రియల్ టైమ్​లో ప్రజలపై, వ్యాపార కార్యకలాపాలపై, సంఘాలపై కొవిడ్​-19 ప్రభావాన్ని ఆయన గుర్తించగలిగారు. ఫలితంగా ప్రభుత్వాలు... ఆర్థిక అంశాలను, ప్రజారోగ్య ప్రాధాన్యతలను సమతుల్యం చేసే విధాన నిర్ణయాలు తీసుకునేందుకు వీలైంది."

- కార్నెగీ కార్పొరేషన్​

ఇదీ చూడండి: చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.