ETV Bharat / international

యుద్ధం వద్దంటూ రోడ్డెక్కిన అమెరికా ప్రజలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధాన్ని రేకెత్తించేలా ఉన్నాయంటూ ఆ దేశ ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వాషింగ్టన్​లోని సియాటెల్​ పట్టణంలో ప్లకార్డులు చేతపట్టి కయ్యం వద్దొంటూ నినాదాలు చేశారు.

Protesters in Seattle gathered on Sunday to express their opposition to measures taken by the US in relation to developments in Iraq and Iran, which some said they fear to be a "provocation to war".
యుద్ధం వద్దంటూ రోడ్డెక్కిన అమెరికా ప్రజలు
author img

By

Published : Jan 5, 2020, 3:00 PM IST

ఇరాన్​ టాప్​ మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యనంతరం ఇరాన్-అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రజలు శాంతి స్థాపన కోసం రోడ్డుకెక్కారు. ఇరాన్, ఇరాక్​లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వాషింగ్టన్​లోని సియాటెల్​ పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ట్రంప్ చేపడుతున్న చర్యలు యుద్ధాన్ని ఉసిగొల్పే విధంగా ఉన్నాయని నిరసనకారులు ఆరోపించారు. "యుద్ధం వద్దు" అంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు.

యుద్ధం వద్దంటూ రోడ్డెక్కిన అమెరికా ప్రజలు

యుద్ధ భయాలు...

ఇరాన్​తో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఇప్పుడు అదనంగా 2,900 మంది సైన్యాన్ని ఆ దేశ పరిసరాల్లోకి అమెరికా పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సులేమానీని చంపినందుకు ప్రతీకార చర్యగా అమెరికాపై మరోసారి దాడి చేసినట్లయితే తీవ్ర ప్రతిఘటన చర్యలు ఉంటాయని ట్రంప్ ఇదివరకే ఇరాన్​ను హెచ్చరించారు. ఇరాన్​లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది.

మరోవైపు ఇరాన్​లో జనరల్ ఖాసిం సులేమానీపై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించి కాంగ్రెస్​(అమెరికా పార్లమెంట్)లో అధికారిక ప్రకటన ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా సైనిక దాడి చేపట్టిన 48 గంటలలోగా కాంగ్రెస్​లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయాలి.

AP Video Delivery Log - 2200 GMT News
Saturday, 4 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2159: Iraq Najaf Funeral Procession AP Clients Only 4247558
Soleimani, al-Muhandis procession reaches Najaf
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.