దక్షిణ అమెరికా చిలీలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లమీదకు వచ్చి అధ్యక్షుడు పినెరాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. కొంతమంది బృందంగా ఏర్పడి ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లు, భవనాలకు నిప్పంటించారు. సామాజిక పథకాల అమల్లో లోపాలు, అధిక జీవన వ్యయంపై దృష్టి సారించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
10 రోజుల హింసాకాండలో 20 మంది బలి
ప్రదర్శనలు చేపట్టి 10 రోజులు కావస్తున్నా చిలీ ప్రభుత్వం ఇప్పటివరకు నిరసనకారులకు అనుకూలంగా.. ఎటువంటి హామీలు ప్రకటించలేదు. ఈ హింసాత్మక చర్యల్లో 20 మంది మరణించారు.
ఇదీ చూడండి: దశాబ్దం తర్వాత 'హరియాణా' చరిత్ర పునరావృతం