ETV Bharat / international

స్టూడెంట్ మాస్క్ పెట్టుకోలేదని.. క్లాస్ మధ్యలోనే ప్రొఫెసర్ రిటైర్మెంట్ - international news telugu

ఓ యూనివర్సిటీలో విద్యార్థిని మాస్కు సరిగ్గా ధరించలేదని క్లాస్ మధ్యలోనే వెళ్లి రాజీనామా చేశారు ప్రొఫెసర్. మాస్కు ముక్కును కవర్​ చేసేలా పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

Professor Resigns in Middle of Class After Student Refuses to Wear Mask Properly
మాస్కు సరిగ్గా ధరించని స్టూడెంట్- క్లాస్ మధ్యలో ప్రొఫెసర్ రిజైన్​
author img

By

Published : Aug 30, 2021, 4:58 PM IST

Updated : Aug 30, 2021, 5:45 PM IST

ఓ స్టూడెంట్​ మాస్కు సరిగ్గా ధరించలేదని క్లాసు మధ్యలోనే వెళ్లి పదవీ విరమణ చేశారు 88 ఏళ్ల ప్రొఫెసర్. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాట వినకపోవడం వల్ల రిజైన్ చేసి యూనివర్సిటీ వదిలి వెళ్లిపోయారు. అమెరికాలోని జార్జియా యూనివర్సిటీలో గతవారం ఈ ఘటన జరిగింది.

ఈ యూజీసీ ప్రొఫెసర్ పేరు ఇర్విన్ బెర్న్​స్టీన్. జార్జియా యూనివర్సిటీలో సైకాలజీ బోధిస్తున్నారు. ఓ విద్యార్థిని మాస్కును ముక్కు కవర్ చేయకుండా ధరించింది. క్లాసు మొదలైన 5 నిమిషాలకు ప్రొఫెసర్ ఆమెను గమనించి మాస్క్​ సరిగ్గా పెట్టుకోవాలని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ స్టూడెంట్​ ప్రొఫెసర్ మాటలను పెడచెవిన పెట్టింది. మాస్కు ముక్కుపైనుంచి ధరిస్తే ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉందని చెప్పింది. దీంతో మాస్కు సరిగ్గా ధరించకపోతే రాజీనామా చేసి వెళ్లిపోతానని ఆయన ఆమెను హెచ్చరించారు. కొన్ని క్షణాల పాటు వేచి చూసినా ఆ అమ్మాయి తీరు మారలేదు. 88 ఏళ్ల వృద్ధుడైన తనకు మధుమేహం ఉందని, కొవిడ్ ముప్పు ఎక్కువని విద్యార్థికి చెప్పే ప్రయత్నం చేసినా ఆమె పట్టించుకోలేదు. దీంతో 'అయామ్ రిటైరింగ్​' అని తన బ్యాగులో పుస్తకాలు సర్దుకొని ఇర్విన్ వెళ్లిపోయారు.

దేశం కోసం సైన్యంలో పనిచేసినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టానని, కానీ ఇప్పుడు మాస్క్ సరిగ్గా ధరించని ఓ నిర్లక్ష్యపు స్టూడెంట్​కు క్లాస్ చెప్పి తన జీవితాన్ని రిస్క్ చేయలేనని ప్రొఫెసర్ అన్నారు.

జార్జియా యూనివర్సిటీ విద్యార్థులు మాస్కు ధరించాలని కచ్చితమైన నిబంధన ఏమీ లేదు. అయితే తరగతులు మొదలైన రెండో రోజే ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. దీంతో తన క్లాస్లులో మాస్కు తప్పనిసరి అని ఇర్విన్ స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఈ విషయంపై తన క్లాసు బయట స్టిక్కర్ అంటించారు.

ఇంత జరిగినా ఆ విద్యార్థిని ఏమాత్రం పశ్చాత్తాపపడలేదు. ప్రొఫెసర్ వెళ్లిపోయినందుకు ఆనందించింది.

ఇదీ చూడండి: Afghan Crisis: చైనా చిలుక పలుకులు- తాలిబన్లకు 'దారి' చూపాలట!

Last Updated : Aug 30, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.