ETV Bharat / international

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించేది లేదు: ట్రంప్

ఎన్నికల్లో ఓటమిని అంగీకరించనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అన్నారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బైడెన్​పై తానే గెలిచానని చెప్పుకొచ్చారు. మీడియా నకిలీ కథనాల్లోనే బైడెన్ గెలిచినట్లు పేర్కొన్నారు.

TRUMP-TWEET-ELECTION
ట్రంప్
author img

By

Published : Nov 16, 2020, 10:22 PM IST

అధికార బదలాయింపునకు మొండిగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించనని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బైడెన్​పై తాను గెలిచానని ప్రకటించారు.

వీటిని రిగ్గింగ్‌ ఎన్నికలుగా అభివర్ణించిన ట్రంప్‌.. ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మీడియా నకిలీ కథనాల్లోనే బైడెన్‌ గెలిచినట్లు ఆయన పేర్కొన్నారు. దీన్ని తాను అంగీకరించనని ట్రంప్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై ప్రయాణం ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు.

రీకౌంటింగ్​పైనా..

జార్జియాలో కొనసాగుతున్న రీకౌంటింగ్ ప్రక్రియపైనా ట్రంప్ ఆరోపణలు చేశారు. అక్కడ నకిలీ రీకౌంటింగ్ సాగుతోందని అన్నారు. ఓట్లపై సంతకాల పరిశీలన, ధ్రువీకరణ జరగట్లేదని తెలిపారు.

అయితే, ట్రంప్ చేసిన ట్వీట్ల​ను ట్విట్టర్​ తప్పుడు సమాచారం కింద ఫ్లాగ్ చేసింది. అధికారిక సమాచారం ఇందుకు భిన్నంగా ఉందని తెలిపింది.

TRUMP-TWEET-ELECTION
ట్రంప్ ట్వీట్లు

బైడెన్ విజయం..

నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. జార్జియా మినహా ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'ట్రంప్.. ఇప్పటికైనా ఓటమిని ఒప్పుకో'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.